బిగ్ బాస్ ఓటీటీ అట్టహాసంగా ప్రారంభమైపోయింది. ప్రేక్షకులు బుల్లితెరను వదిలేసి.. మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయారు. 17 మంది కంటెస్టెంట్స్ తో వారియర్ Vs ఛాలెంజర్ అంటూ సరికొత్తగా ఓటీటీ షోను ప్రారంభించారు. బిగ్ బాస్ ఓటీటీని కూడా నాగార్జున అదే జోష్ తో ప్రారంభించాడు. ఈసారి లేడీస్ హవా ఎక్కువగా ఉంది. అషూరెడ్డి, హమీదా, సరయు, ముమైత్, అరియానా, బింధు మాధవి వీళ్లంతా బిగ్ బాస్ లో సీనియర్లు కావడంతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
మొదటిరోజే అరియానా డ్రెస్ గురించి అషూరెడ్డి సెటైర్లు వేస్తూ రెచ్చిపోయింది. ‘అరియానా డ్రెస్ చూశారా? ఎక్కడో చూసినట్లు ఉంది. హా ఉదయం బాత్ రూమ్ లో, కిచెన్ లో చూశాను. వేసుకోవడానికి బట్టలు లేక డస్ట్ బిన్ కవర్లను చుట్టుకుంది’ అంటూ అరియానాను టీజ్ చేసింది. అక్కడితో ఆగకుండా కిచెన్ లో డస్ట్ బిన్ కవర్ తీసుకొచ్చి అరియానా చేతికి చుడుతూ ఆమె డ్రెస్ ను మోడిఫై కూడా చేసింది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. బిగ్ బాస్ ఓటీటీలో మీకు బాగా నచ్చిన సభ్యుడు ఎవరో కామెంట్స్ రూపంలో తెలియజేయంజి.
Thank you #BiggBossTeluguOTT pic.twitter.com/USDtOpXogU
— patRRRick jane🌊 (@_Usk57) February 26, 2022
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV APP డౌన్లోడ్ చేసుకోండి.