మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. స్వల్ప లక్షణాలతో ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. దీంతో ఇదే విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ వేదికగా ఆయన తెలియజేశాడు. గత రెండు రోజులుగా నీరసంగా ఉంటే కోవిడ్ టెస్ట్ చేసుకున్నాను. కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే ప్రభుత్వ గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యాను. ఈ రెండు మూడు రోజులు నాతో పాటు తిరిగిన వాళ్లు కూడా ఎలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని తెలిపారు. ఇక ఇటీవల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరిన విషయం తెలిసిందే. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన నల్గగొండ జిల్లాలో భారీ బహిరంగ సభ వేదికగా ఆయన బీఎస్పీ పార్టీలోకి చేరాడు. దీంతో బహుజనులను ఏకతాటిపై తెచ్చి రాజ్యాధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఆయన అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగానే ప్రవీణ్ కుమార్ ఆ పార్టీలో చేరానని చెప్పాడు. ఇక ఐపీఎస్ పదవీ కాలం ఆరు సంవత్సరాలు మిగిలే ఉన్నప్పటికీ ఆయన రాజీనామా చేయటం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. గతంలో ఆయన టీఆర్ఎస్లో పార్టీలోకి వెళ్తాడన్న వార్తలు సైతం ఊపందుకున్నాయి. ఇక ఎట్టకేలు అన్ని వార్తలకు చెక్ పెడుతూ జాతీయ పార్టీ అయిన బీఎస్పీలో చేరాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గత రెండురోజులుగా నీరసంగా ఉంటే Covid టెస్టు చేయించుకుని, Positive గా నిర్దారణ అయిన వెంటనే ప్రభుత్వ గాంధీ హాస్పిటల్ కు వచ్చి చికిత్స చేయించుకుని ఇప్పుడే డిశ్చార్జి అయ్యాను. నాతో అతి దగ్గరగా తిరిగిన వ్యక్తులూ,Please isolate yourselves. I have mild symptoms. Nothing to worry at all. pic.twitter.com/mqYTfC8fmL — Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) August 10, 2021