తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచన తీరే వేరని చెప్పాలి. విపక్షాల ఎత్తులను చిత్తు చేయగల నేర్పు ఆయన సొంతం. ఆయన మాట తీరు తెలంగాణ ప్రజలను అట్టే ఆకట్టుకుంటుంది. ఏ ఎన్నికల్లో అయిన తన మాట వాగ్ధాటితో జనాలను తన వైపు తిప్పుకుంటారు సీఎం. తన వ్యూహాలను పదును పెడుతూ విపక్షాలకు దిమ్మ తిరిగే కౌంటర్ వేస్తాడు. ఈ క్రమంలోనే తాజాగా మరో మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నాడు ఈ గులాబీ బాస్. ఇక మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హుజురాబాద్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఇక్కడ ఎలాగైన గెలవాలని సీఎం కేసీఆర్ తెర వెనుక ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇక ఇప్పటికే దళిత బంధు అంటూ ఓ కొత్త పథకాన్ని అమలు చేసిన విషయం మనందరికి తెలుసు. దీంతో దళిత వర్గాలను తప వైపు తిప్పుకునేందుకు ఈ ప్లాన్ పనిచేస్తుందని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. ఇక రానున్న హుజురాబాద్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాలు దువ్వుతున్నాడు సీఎం కేసీఆర్. దీంతో ప్రచారానికి గులాబీ కలర్ అద్దుతూ ప్రభుత్వం నుంచి లబ్ది పొందుతున్న హుజురాబాద్ లబ్దిదారులకు లేఖలు రాస్తుంది తెలంగాణ సర్కార్. టీఆర్ఎస్ సంక్షేమ పాలనను వివరించేలా తయారు చేసిన ఈ లేఖలను ఓటర్లకు పంచి పెడుతూ ఓ సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది ప్రభుత్వం. ఈ మంత్రంతో లబ్దిదారులను తమ వైపు తిప్పుకుని ఓట్లు రాల్చుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు గులాబీ నేతలు.ఇక ప్రభుత్వ పథకాలైన షాదీముబారక్, గొర్రెల పంపిణీ, బర్రెల పంపిణీ కళ్యాణ లక్ష్మీ, ఆసరా పెన్షన్, కేసీఆర్ కిట్ వంటి పథకాల లబ్దిదారుల లీస్ట్ను రెడీ చేస్తున్నారు స్థానిక నేతలు.