స్పెషల్ డెస్క్- మనిషికి 5 నుంచి 6 గంటల నిద్ర చాలని వైద్య నిపుణులు చాలా సందర్బాల్లో చెప్పారు. ఎన్నో అంతర్జాతీయ వైద్య పరిశోధనలు కూడా 6 గంటల పాటు నిద్రపోతే మినిషి ఆరోగ్యంగా ఉంటాడని చెబుతున్నాయి. ఇక కాస్త ఎక్కువ సమయం నిద్రపోయే వాళ్లను, సూర్యుడి చుర్రుమంటున్నా నిద్ర లేవని వాళ్లను మనం కుంభకర్ణుడితో పోలుస్తాం. ఎందుకంటే కుంభకర్ణుడు ఆరు నెలలు ఎకధాటిగా తిండి తింటే, ఆరు నెలలపాటు నిద్రపోయేవాడట. ఇక రాముడు వనవాసానికి వెళ్లిన సమయంలో ఆయనతో పాటు తమ్ముడు లక్షణుడు కూడా అడవులకు వెళ్లాడు కదా. అలా వాళ్లు వనవాసానికి వెళ్ళగానే లక్ష్మణుడి భార్య ఊర్మిళ వారు వచ్చే వరకు సుమారు పధ్నాలుగేళ్ళు నిద్రలోనే గడిపిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఇప్పుడు కూడా కొంతమంది ఆరోగ్య పరిస్థితుల నేపధ్యంలో, వాళ్లు వాడుతున్న మందుల వలన ఎక్కువ సేపు నిద్రపోతూ ఉంటారు. అయితే ఈ కలికాలంలో ఓ ఆమ్మాయి ఒకసారి నిద్రపోతే 13 రోజుల పాటు లేవనే లేదట. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా.. ఐతే మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాల్సందే. ఇండోనేషియాలోని దక్షిణ కాలిమంటన్ ప్రాంతంలోని బంజర్ మాసిన్ లో ఏచా అనే 17 ఏళ్ల అమ్మాయి ఉంటోంది. ఈ అమ్మాయి ఒకసారి 2017 సంవత్సరంలో వరుసగా 13 రోజులపాటు నిద్రపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. సాధారనంగా ఒక్కరోజు తిండి లేకపోతేనే ఎవరికైనా నీరసం వచ్చేస్తుంది. అలాంటిది ఏకంగా 13 రోజులపాటు తిండీ.. కనీసం నీరు కూడా లేకుండా నిద్రలో ఉండిపోవడం అంటే ఆషామాషి కాదు. ఏచా ఇలా ఒకసారి నిద్రపోతే ఎప్పుడు లేస్తుందో తెలీని పరిస్థితి రెండు మూడుసార్లు జరిగేసరికి కుటుంబ సభ్యులు ఆమెను వైద్యులకు చూపించారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు అన్ని పరీక్షలు చేశాక ఆమెకు ఎలాంటి సమస్య లేదని చెప్పారు. అయితే అతిగా నిద్రపోవడం వలన ఆమె చాలా బలహీనంగా ఉందని మాత్రం తెలిపారు. ఐతే హైపర్ సోమియా అనే అరుదైన న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడే వారికి ఇటువంటి అతి నిద్ర సమస్య వస్తుందని వైద్యులు పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సాధారణం కంటే ఎక్కువ సేపు నిద్రపోతుంటారని వారు తెలిపారు. తన కూతురిని నిద్ర నుంచి లేపడానికి చాలాసార్లు ప్రయత్నించానని, తాను మాత్రం నిద్రలేచేది కాదని ఆమె తండ్రి చెప్పాడు. నిద్రలో ఉన్నప్పుడే ఆమెను వాష్ రూంకు తీసుకెళ్తున్నామని.. ఇది ఇంకే్నాళ్లో అర్ధం కావడం లేదని వారు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.