mamata benarjee in 1980 పొలిటికల్ డెస్క్- వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దీంతో దీదీ ముచ్చటగా మూడోసారి సీఎం పదవి చేపట్టబోతోంది. ఐతే ఈ సమయంలో 1980ల నాటి మమత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియా కూడా మమతపై ప్రశంసలు కురిపిస్తోంది. ముచ్చటగా మూడోసారి ఆమె విజయం సాధించినందుకు పార్టీలకు అతీతంగా అభినందనలతో ముంచెత్తుతున్నారు. ట్విట్టర్లో 1980ల నాటి మమతా బెనర్జీ బ్లాక్ అండ్ వైట్ ఫొటో తెగ వైరల్ అవుతోంది. mamata benarjee in 1980 ఇండియన్ హిస్టరీ పిక్స్ అనే ట్విట్టర్ ఖాతా పోస్టు చేసిన ఈ ఫోటో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. మమత నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయ జీవితంలో ఇది అత్యంత క్లిష్టతరమైన పోటీ అని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్ షా తదితరులను ఎదురొడ్డి నిలిచిన ధీరవనిత అని కొనియాడుతున్నారు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా మమతా బెనర్జీకి సంబందించిన ఈ ఫొటోను పలువురు షేర్ చేస్తూ మమతకు అభినందనలు తెలుపుతుండం విశేషం.