న్యూ ఢిల్లీ- గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. భారత్ లో 18 రోజుల విరామం తర్వాత మంగళవారం చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 15 పైసలు, డీజిల్ ధర లీటరుకు 16 పైసలు పెరిగింది. గత నెల 15వ తేదీన పెట్రోల్ ధర లీటరుకు 16 పైసలు, డీజిల్ ను 14 పైసలు తగ్గింది. ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర 90.56 రూపాయలకు చేరగా, లీటరు డీజిల్ ధర 80.73 రూపాయలకు చేరింది. గత ఏడాది పెట్రోల్ ధర లీటరుకు 21.58 రూపాయలు, డీజిల్ ధర లీటరుకు 19.18రూపాయలు పెరిగింది. ముంబైలో పెట్రోల్ లీటరు ధర 96.83రూపాయలు, డీజిల్ ధర 87.81రూపాయలకు చేరింది. చెన్నైలో పెట్రోలు 92.43, డీజిల్ 85.75 రూపాయలకు, కోల్ కతాలో పెట్రోల్ 90.62, డీజిల్ లీటరు ధర 83.61 రూపాయలకు చేరింది. ఇక ముడిచమురు అంతర్జాతీయ మార్కెటులో బ్యారెల్ ధర 66 డాలర్లకు చేరువైంది. కరోనా కారణంగా దేశంలో మొత్తం ఇంధన డిమాండ్ 7 శాతం తగ్గిందని భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది.