ఫిల్మ్ డెస్క్- దక్షిణాది అగ్ర కధానాయిక అనుష్క శెట్టి గురించి తెలియని సీనీ అభిమానులు ఉండరు. ఎందుకంటే స్వీటీ చేసింది తక్కువ సినిమాలే అయినా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. అనుష్క శెట్టి ప్రస్తుతం చేతిలో ఉన్న కొన్ని సినిమాలతో చాలా బిజీగా ఉంది. స్వీటీ పెళ్లిపై అప్పుడప్పుడు మీడియాతో పాటు సోషల్ మీడియాలోను జోరుగా చర్చ జరుగుతూ వస్తోంది. తాజాగా అలాంటి చర్చే మళ్లీ అనుష్కపై మొదలైంది. అనుష్కకు త్వరలో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారట. దీనికి ఆమె కూడా ఓకే చెప్పిందని తెలుస్తోంది. దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొడుకుతో వివాహం జరగనున్నట్లు సమాచారం. అయితే అతడు అనుష్క కంటే వయసులో చిన్నవాడనే టాక్ నడుస్తోంది. ఒకవేళ అంతా కుదిరితే కరోనా పరిస్థితులు సాధారణం స్థితికి వచ్చాక పెళ్లి చేస్తారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. పెళ్లి కొడుకు అనుష్క కంటే నాలుగేళ్లు చిన్నవాడని తెలుస్తోంది. గతంలో డార్లీంగ్ ప్రభాస్, అనుష్కల జోడిపై కూడా చాలా రూమర్స్ వచ్చాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారనే చర్చ కూడా జరిగింది. అయితే దీనిపై ప్రభాస్, అనుష్కలు స్పందించి తాము కేవలం స్నేహితులమే అని క్లారిటి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇన్నాళ్లకు అనుష్క నిజంగా పెళ్లి పీఠలెక్కబోతోంది. మరి తనకంటే నాలుగేళ్లు చిన్నవాడిని ఎందుకు పెళ్లి చేసుకుంటోందన్న దానిపై త్వరలోనే అనుష్క క్లారిటీ ఇవ్వనుందని సమాచారం.