kangana ranaut డిజిటల్ డెస్క్- ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. కంగనా ట్విటర్ ఖాతాను శ్వాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ట్విటర్ తెలిపింది. వివాదాస్పద వ్యాఖ్యలను పోస్ట్ చేయడం ద్వారా ట్విటర్ నియమ, నిబంధనలను కంగనా ఉల్లంఘించారని ట్విట్టర్ స్పష్టం చేసింది. విద్వేషపూరిత, అసభ్య ప్రవర్తన కారణంగా కంగనా రనౌత్ ఖాతాను శాశ్వతంగా తొలగిస్తున్నట్లు ట్విట్టర్ పేర్కొంది. తాజాగా పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం కంగన చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. Kangana ranaut బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కించపరిచేలా కంగనా ట్వీట్ చేయడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల ఫలితాల తరువాత బెంగాల్లో హింస చెలరేగే అవకాశం ఉందని జర్నలిస్ట్, రాజకీయనాయకురాలు స్వపన్ దాస్ గుప్త చేసిన ట్వీట్‌కు కంగనా బదులిస్తూ అభ్యంతరకరమైన విధంగా ట్లీట్ చేసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ట్విట్టర్ కంగనా అకౌంట్ ను పర్మినెంట్ గా తొలగించింది. ఐతే దీనిపై ఇంకా కంగనా స్పందించలేదు.