తెలుగు బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ మాచిరాజు వేగంగా దూసుకెళ్తున్నాడు. తనదైన కామెడీ టైమింగ్ డైలాగ్‌తో యాంకరింగ్‌లో తనక ఎవరూ సాటి లేరని నిరూపిస్తున్నాడు. తెలుగు బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు ఉన్నా ప్రదీప్ తర్వాతే అని చెప్పక తప్పదు. ఇక లేడీ యాంకర్స్‌ను కూడా పక్కనబెట్టే సత్తా ప్రదీప్‌కు ఉంది. అయితే ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించంటం ఎలా అనే సినిమాలో హారోగా నటించి ప్రసంశలు అందుకున్నాడు. ఇందులో ప్రదీప్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. దీంతో మెల్లమెల్లగా సినిమాల్లోకి వెళ్లేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రదీప్. ఇక విషయం ఏంటంటే..? తాజాగా ఓ టీవీ షోలో డ్రామా జూనియర్స్ అనే ప్రోగ్రామ్‌లో సునీత జడ్జ్‌గా వెళ్లింది. అందులో ఓ అబ్బాయి చందమామ క్యారెక్టర్‌తో కూడిన ఓ స్కిట్ చేశాడు. ఈ స్కిట్లో భాగంగా పవన్ కళ్యాణ్ డైలాగ్..అమ్మాయిలు డేంజర్ రోయ్..చాలా డేంజర్ అనే డైలాగ్ అనే డైలాగ్ చెబుతాడు. ఇక స్కిట్ పూర్తైన తర్వాత సునీత ఆ అబ్బాయి డైలాగ్ మళ్లీ చెప్పమని అడిగింది. దీంతో వెంటనే ఆ బాలుడు ఆ డైలాగ్ చెప్పాడు. వెంటనే సునీత స్పందిస్తూ..ఈ షోలో ఉండాలనుందా లేక వెళ్లిపోవాలనుందా? ఇక్కడ ఎంత మంది ఆడవాళ్లు ఉన్నారో చూశావుగా అని అంటుంది. దీంతో వెంటనే ప్రదీప్ అందుకుని అరెయ్..నేను చెప్పమన్నది అమ్మాయిల గురించి రా..అంటూ నవ్వుతూ అంటాడు. దీంతో వెంటనే సునీత స్పందిస్తూ..అందుకే నీకు ఇంకా పెళ్లి కాలేదు అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చింది. దీంతో ఆ షోలో ఉన్నవాళ్లంతా పగలబడి నవ్వుకున్నారు. https://youtu.be/FsHvUjHLCPo