మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వేడి రాజుకున్నప్పటి నుంచి దీనిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. లోకల్, నాన్ లోకల్, మా బిల్డింగ్ నిర్మాణంపై కొందరు టాలీవుడ్ ప్రముఖుల ఒక్కొక్కరు ఒకొలా వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. గత కొంత కాలం నుంచి మా కు కొత్త బిల్డింగ్ నిర్మించాలంటూ కొందరు టాలీవుడ్ నటులు పెదవి విప్పారు. తాజాగా ఇదే అంశంపై స్పందించారు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. ‘మా’ బిల్డింగ్ నిర్మాణానికి నేను వ్యతిరేకినంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక రూ.20 కోట్లతో మా బిల్డింగ్ నిర్మాణం చేపట్టడం కన్నా పేద ఆర్టిస్టులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఉచితంగా ఇస్తే బాగుంటుందని బండ్ల గణేష్ సుచించారు. ఇక ఇలాంటి పని కోసం మన హీరోలు కూడా ముందుకు వస్తారని, ప్రస్తుతం ‘మా’కి బిల్డింగ్ లేకపోతే ఇండస్ట్రీ ఏం ఆగిపోదంటూ బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దానికంటే ముందు చేయాల్సిన పనులో ఇంకా చాలా ఉన్నాయన్నారు. ప్రస్తుతం మాలో 900 లో సరైన ఆర్థిక స్థోమతలేక ప్రతి నెలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నవారు చాలా మందే ఉన్నారని ఆయన తెలిపారు. ఇక ఇదిలా ఉంటే మా ఎన్నికల రేసులో అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్. ఈయనతో పాటు మంచు విష్ణు, హేమ, జీవిత, సీవీఎల్ నరసింహన్ వంటి ప్రముఖులు కూడా రేసులో కొనసాగుతున్నారు. అయితే వీళ్లందరికంటే మందుగానే ప్రకాష్ రాజ్ ఏకంగా తన ప్యానెల్‌ను కూడా ప్రకటించి మా ఎన్నికల్లో కాస్త హీట్ పెంచారు. ఇక బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.