సూపర్ స్టార్ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్’ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ‘శిల్పా శెట్టి’ నటిస్తోందని ఇప్పటికే రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. త్రివిక్రమ్ రాసుకున్న కథలో శిల్పా శెట్టి క్యారెక్టర్ మహేష్ కి ఆమె పిన్నిగా కనిపించబోతుందట. కథలో కీలకంగా ఉండే ఓ క్యారెక్టర్‌కు సాగర కన్య శిల్పా అయితేనే సరిగ్గా సూట్ అవుతుందని భావించిన మాటల మాంత్రికుడు ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకు న్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో ఆమె క్యారెక్టర్ మోడ్రన్‌గా ఉండటమే గాక హీరోతో పోటాపోటీగా ఉండనుందని తెలుస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రతి సినిమాలో ఓ సీనియర్ హీరోయిన్ని పెట్టి అట్రాక్ట్ చేసే త్రివిక్రమ్ ఇప్పటికే నదియా, ఖుష్బూ, దేవయాని, టబూ లాంటి తారలతో ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. దీంతో ఇప్పుడు శిల్పాశెట్టిని తీసుకొస్తున్నారనే మాట మహేష్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది . పదకొండు సంవత్సరాల 'అతడు' తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాల తరువాత త్రివిక్రమ్ చేస్తోన్న సినిమా కాబట్టి, ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అలాగే చిత్రంలోని మరో కీలకపాత్ర కోసం సుమంత్‌ని తీసుకోవాలనుకుంటున్నారట. మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమాని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు 'సర్కారు వారి పాట' మూవీతో బిజీగా ఉన్నారు.