ఆగ్రాలోని ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్ మహల్ వద్ద.. ఓ విమానం చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో విమానాలు, డ్రోన్లపై ఆంక్షలు ఉన్న వేళ ఓ విమానం చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. తాజ్ పరిసర ప్రాంతాన్ని ‘నో ఫ్లైయింగ్’ జోన్‌గా ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. ప్రస్తుతం మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఉరుసు ఉత్సవాలు జరుగుతున్న సమయంలో.. విమానం తాజ్ మహల్‌కు సమీపంగా రావడం చూసి పర్యటకులు భయాందోళనకు గురయ్యారు. ఇది చదవండి: అర్థంలేని ట్వీట్లు చేస్తున్న రోహిత్ శర్మ! ఆందోళనలో ఫ్యాన్స్.. తాజ్ సమీపంలో విమానం ఎగురుతుండగా తాను కూడా చూశానని ఆగ్రా సర్కిల్ ఏఎస్ఐ కూడా చెప్పారు. ఈ క్రమంలో విమానం చక్కర్లు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. కాగా, దీనిపై స్పందించిన ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇవ్వాలంటూ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌ను కోరింది.