Chandu Gowda: తెలుగు సీరియల్ యాక్టర్ చందూగౌడ.. ఇటీవలే తన భార్య షాలినితో కలిసి పేరెంట్స్ కాబోతున్న విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. 2020లో తన చిరకాల స్నేహితురాలైన షాలినిని పెళ్లి చేసుకున్న చందు.. తాజాగా బెంగళూరులో తన భార్యకు సంప్రదాయ బేబీ షవర్(సీమంతం)ని ఏర్పాటు చేశాడు. ఈ వేడుక ప్రైవేట్ గా జరిగినప్పటికీ, టెలివిజన్ ఇండస్ట్రీ నుండి చాలామంది ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చందు, షాలినికి సంబంధించిన బేబీ షవర్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అలాగే చందు, షాలిని కూడా ఫోటోలలో ఎంతో అందంగా.. పుట్టబోయే బిడ్డను స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారి ముఖాలలో ఆనందం చూస్తే అర్థమవుతుంది. ఇద్దరూ కూడా సాంప్రదాయక దుస్తులలో సందడి చేశారు. మొత్తానికి ఈ జంట తమ బేబీ షవర్ వేడుకను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. ఇదిలా ఉండగా.. చందు, షాలిని ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ళ ప్రేమ తర్వాత ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. ఇక కెరీర్ పరంగా చందు కన్నడ టీవీ ఇండస్ట్రీలో పాపులర్ యాక్టర్. 'లక్ష్మీ బారమ్మ' అనే మెగా సీరియల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ తర్వాత 'చాట్ కార్నర్' అనే టాక్ షోతో హోస్ట్‌గా మారాడు. ఇక త్రినయని సీరియల్ లో హీరోగా చందు తెలుగు బుల్లితెరపై డెబ్యూ చేసాడు. అదీగాక పలు సినిమాలు కూడా లైనప్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి చందు - షాలిని జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. View this post on Instagram A post shared by celebrity world (@celebrityworld.instaa) View this post on Instagram A post shared by (@quadcore__media__house)