కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2022 ఫ్రాన్స్ లో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఇండియా నుంచి పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. దీపికా పదుకునే తమన్నా, ఊర్వశీ రౌతేలా వంటి అందాల భామాలు ఇండియన్ పెవిలియన్ ప్రారంభోత్సవంలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో వీళ్లు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ వేడుకలో పాల్గొనడం తమన్నా, పూజాకి ఇదే మొదటి సారి. ఈ క్రమంలో కేన్స్ లో పూజా తన అందంతో అందరిని ఆకట్టుకుంది. ఈ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానలతో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూజా అందాలను ఆమె అభిమానులు తెగ పొగిడేస్తున్నారు. టాలీవుడ్ బుట్టబొమ్మగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఫ్యాషన్ విషయంలో ఏ మాత్రం తగ్గేదే లే అంటోంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదిరేటి డ్రస్సులతో పూజా హెగ్డే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ట్రెండీ దుస్తుల్లో కనిపించి కుర్రాళ్ల గుండెల్లో మరింత గుబులు రేపింది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. మరి.. కేన్స్ వేదికపై బుట్టబొమ్మ చేసిన సందడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja)