Thalapathy Vijay: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల యాక్షన్ ని అభిమానులు ఎంతగా ఇష్టపడతారో.. వారి డ్యాన్స్ ని కూడా అంతే ఎక్కువగా ఆదరిస్తారు. ఇదివరకు స్టార్ హీరోలు చేసిన డ్యాన్స్ కి, ఇప్పుడు చేస్తున్న ట్రెండీ డ్యాన్స్ కి మధ్య ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో ఎంత మాస్ బీట్ సాంగ్ అయినా.. రిస్క్ లేకుండా సింపుల్ స్టెప్స్ తో కానిచ్చేవారు. కానీ.. అలాంటి డ్యాన్స్ కి ఇప్పుడు కాలం చెల్లిపోయిందనే చెప్పాలి. కేవలం కాళ్ళు చేతులు ఊపుతూ చేసే డ్యాన్స్ ని కామెడీ చేసేస్తున్నారు. ఈ క్రమంలో ట్రెండ్ కి తగ్గట్టుగా వెరైటీ స్టెప్స్ తో, డ్యాన్స్ లో కొత్తరకం విన్యాసాలు చేయడానికి సిద్ధపడుతున్నారు. కొందరు కెరీర్ ప్రారంభం నుండి కూడా డ్యాన్స్ కి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్నటువంటి దక్షిణాది స్టార్ హీరోలలో దళపతి విజయ్ ఒకరు. ఆయన కోలీవుడ్ లో తిరుగులేని స్టార్ అయినప్పటికీ, ఆయన సినిమాలు, పాటల కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. ఇటీవల బీస్ట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇక యాక్షన్ మూవీగా తెరకెక్కిన బీస్ట్ సినిమాలో 'అరబిక్ కుత్తు' సాంగ్ ఏ స్థాయిలో సోషల్ మీడియాను షేక్ చేసిందో చెప్పక్కర్లేదు. కేవలం తమిళ అరబిక్ కుత్తు లిరికల్ పాటనే 430 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టగా, ఇటీవల విడుదలైన ఫుల్ వీడియో సాంగ్ 113 మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతుంది. అయితే.. ఈ పాటలో విజయ్, పూజాహెగ్డేల డ్యాన్స్.. ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. కానీ.. ఇదే పాటలో విజయ్ చేసిన ఓ స్టెప్ పై పలు విమర్శలు వినిపించడం గమనార్హం. అరబిక్ కుత్తు వీడియో సాంగ్ లో విజయ్ ఓ కర్రను పట్టుకొని.. వేసే స్టెప్పు ఒరిజినల్ వెర్షన్ చేయలేదని, విజయ్ మార్చేసి మాయ చేశాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు విజయ్ ఆ స్టెప్పులో ఏం మార్పులు చేశాడని ఆరా తీస్తే.. ఆ స్టెప్పులో కొరియోగ్రాఫర్ పాదాలు పైకి లేవకుండా స్టెప్స్ చేశాడు. అదే స్టెప్ విజయ్ దగ్గరకు వచ్చేసరికి.. రెండు కాళ్ళు గాల్లో లేపుతూ ఆ స్టెప్పులో మ్యాజిక్ మిస్ చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ప్రస్తుతం అరబిక్ కుత్తు విజయ్ స్టెప్పులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. pic.twitter.com/d0V22zgV0Q — Hardin (@hardintessa143) June 22, 2022