మున్నేరు వాగులో ఈతకు వెళ్లి.. గల్లంతైన ఐదుగురు విద్యార్థుల కథ విషాదాంతమైంది. సోమవారం కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు దగ్గర మున్నేరు వాగులో ఐదురుగు విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ బృందం తిరిగి గాలింపు చర్యలు చేసి.. వారిలో నలుగురు చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. వీరితో పాటు గల్లంతైన ఐదో విద్యార్థి కోసం గాలించి.. చివరికి ఆ చిన్నారి మృతదేహాన్ని కూడా వెలికి తీశారు. ఇసుక కోసం తవ్విన గుంతలో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో గల్లంతైన ఐదుగురు చిన్నారుల కథ విషాదాంతమైయింది. చిన్నారుల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. ఈ ఘటనతో ఏటూరులో విషాదఛాయలు అలముకున్నాయి. ఏటూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చరణ్ (14), కర్ల బాలయేసు (12), జెట్టి అజయ్ (12), మైలా రాకేష్ (11), మాగులూరి సన్నీ (12) కలిసి సంక్రాంతి సెలవులు కావడంతో సోమవారం మధ్యాహ్నం గ్రామానికి కిలో మీటరు దూరంలో ఉన్న మున్నేరులో ఈత కొట్టేందుకు వెళ్లారు. పొలం పనులకు వెళ్లి తిరిగొచ్చిన తల్లిదండ్రులు.. చిన్నారులు రాత్రి అయినప్పటికీ ఇళ్లకు రాకపోవడంతో ఆందోళన చెంది వారి ఆచూకీ కోసం గాలించారు. ఇది చదవండి : లోన్ ఇవ్వలేదని బ్యాంక్ నే తగలబెట్టిన ఘనుడు! మున్నేరు ఒడ్డున చిన్నారుల బట్టలు, సైకిళ్ళు కనిపించాయి. నిన్న సాయంత్రం నుండి ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో గాలింపు కొనసాగింది. మంగళవారం ఉదయం ఐదుగురు చిన్నారుల మృతదేహాలను గుర్తించి మున్నేరు నుంచి బయటకు తీశారు. ఈతకు వెళ్లిన పిల్లలు విగతజీవులుగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారులో కలిగిన ఈత సరద వారి ప్రాణాలనే బలితీసుకుంది. ఈ విషాదకమైన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.