Auto: కంటి పాపలా కాపాడాల్సిన తన ఇద్దరు కూతుళ్లను కడతేడ్చాడో తండ్రి. భార్య మీద ఉన్న కోపాన్ని ఇద్దరు కూతుళ్ల మీద చూపించాడు. వాళ్లను దారుణంగా హత్య చేసి వారి శవాలను ఆటో సీటు కింద దాచాడు. ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకుని రాత్రంతా తిరిగాడు. ఈ సంఘటన కర్ణాటకలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక, బోవిగల్లికి చెందిన లక్ష్మీకాంత్ భార్య నాలుగు నెలల క్రితం ఆమె ప్రియుడితో లేచి పోయింది. అప్పటినుంచి అతడు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. నాలుగు రోజుల క్రితం అమ్మమ్మ గారి ఇంట్లో ఉన్న నలుగురు కూతుళ్లను ఇంటికి తీసుకువచ్చాడు. కన్న తండ్రితో గడపాలని చూస్తున్న వారు ఇంటికి చేరే సరికి ఎంతో సంతోషించారు. మంగళవారం సాయంత్రం నలుగురు పిల్లలల్లో ఇద్దరైన సోని, మయూరీలను తనతో పాటు ఆటోలో బయటకు తీసుకెళ్లాడు. సాయంత్రం వీరేంద్ర పాటిల్ ఎక్స్‌టెన్షన్ వద్ద ఉన్న గార్డెన్ దగ్గర ఆ ఇద్దరు కూతుళ్ల గొంతులు నులిమి చంపేశాడు. అనంతరం వారి శవాలను ఆటో సీటు కింద కుక్కాడు. ఆ రాత్రంతా ప్యాసింజర్లను ఎక్కించుకుని సీటీ మొత్తం చక్కర్లు కొట్టాడు. బుధవారం ఉదయం ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న నవనీత, శ్రేయలను ఆటోలో ఎక్కించుకున్నాడు. నేరుగా దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తన ఇద్దరు కూతుళ్లను చంపేసినట్లు పోలీసులకు చెప్పాడు. భార్య లేచిపోవటం వల్ల డిప్రెషన్‌లో ఉండి ఈ దారుణానికి ఒడిగట్టానని ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : Tamil Nadu: భార్యపై మొదటి నుంచే భర్తకు డౌట్.. ఓ రోజు భార్య చేతులు, కాళ్లు కట్టేసి!