సోషల్ మీడియాలో ప్రతీ రోజూ ఎన్నో రకాల వైరల్ వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. గత కొంత కాలంగా భారత దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఓ వాహనదారుడు చేసిన బైక్ డ్రైవింగ్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
సాధారణంగా వాహనాలపై మనం ఎక్కడికైనా వెళ్తే.. మనతో పాటు ఎంతో కొంత లగేజ్ తీసుకొని వెళ్తూ ఉంటాం. కొంత మంది వాహనాల సామర్ధ్యాలకు మించి సామాన్లు తీసుకు వెళ్తూ నానా అవస్థలు పడుతుంటారు. ఓ వ్యక్తి కూడా తన స్కూటీని మించి లగేజీ తీసుకువెళ్లాడు. ఈ సీన్ చూస్తుంటే.. ఒకటి కాదు.. రెండు కాదు.. మొత్తం షాపులో ఆర్డర్ చేసిన వాటిన్నంటినీ తన బైక్‌పైనే తరలిస్తున్నట్లు మీరు చూడవచ్చు. అయితే.. వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు..? ఎక్కడ అనేది తెలియదు కానీ… వీడియో మాత్రం వైరల్ గా మారింది. అతని కాళ్లు కిందకు ఆనుతున్నాయి.. స్కూటర్ హ్యాండిల్ అందుకోలేంత చివరలో కూర్చొని అతను డ్రైవింగ్ చేస్తున్నాడు.
ట్విట్టర్ లో సాగర్ అనే వ్యక్తిని ఈ వీడియోని షేర్ చేయడం గమనార్హం. ఆ తర్వాత దీనిని తెలంగాణ పోలీసులు కూడా షేర్ చేశారు. ఇలాంటి ప్రమాదకరమైన డ్రైవింగ్ చేస్తే ప్రాణాలకు ప్రమాదం అని చెబుతున్నారు. ఈ వీడియోని ఇప్పటి వరకు 7లక్షల మందికి పైగా వీక్షించారు. నెటిజన్లు ఈ వీడియో చూసిన తర్వాత తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఎక్కడైనా ఆ బైక్ బ్యాలెన్స్ తప్పితే.. ఆ వ్యక్తి బతుకు బస్టాండ్ అవుతుంది సోదరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
My 32GB phone carrying 31.9 GB data pic.twitter.com/kk8CRBuDoK
— Sagar (@sagarcasm) June 21, 2022