రైల్వే ప్రయాణం చాలా మంది ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. కారణం.. అందుబాటు టికెట్ల ధరలు, ప్రయాణం విషయంలోను సౌకర్యంగా ఉంటుంది. అయితే రాత్రి పూట ప్రయాణం విషయంలో ప్రయాణికులు కొంచె ఇబ్బందులు పడుతుంటారు. తాము దిగాల్సిన స్టేషన్ కోసం ఆన్లైన్లో నిత్యం పరిశీలించాల్సి వస్తుంది. అదే రాత్రి వేళల్లో అయితే బోగీలో లైట్లన్నీ ఆర్పి ఉండటం, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కావడంతో వేగంగా వెళ్లడంతో రైలులో నుంచి రైల్వేస్టేషన్లను గుర్తు పట్టే పరిస్థితి ఉండదు. అర్ధరాత్రి దిగాల్సిన స్టేషన్ కోసం నిద్రపోకుండా ఎదురుచూస్తూ ఉండాలి. అయితే తాజాగా ఆ సమస్యకు చెక్ పెడుతూ రైల్వేశాఖ ఓ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. రైల్వే ప్రయాణికులు రాత్రి సమయంలో పొరపాటున తమ స్టేషన్ దాటిపోయి.. హడవుడిగా దిగే క్రమంలో ప్రయాణికులు కిందపడి గాయాలవుతుంటారు. నిద్రపోకుండా స్టేషన్ కోసం వచ్చే వరకు ఎదురు చూస్తుంటారు. అయితే ఇక నుంచి రిజర్వేషన్లో ప్రయాణించే ప్రయాణికులు తమ బెర్త్‌లో ప్రశాంతంగా నిద్రపోయేందుకు భారత రైల్వే అలర్ట్ ఫీచర్ ఆప్షన్ తీసుకువచ్చింది. ఈ ఫిచర్ లో భాగంగా 139 నెంబర్ కి కాల్ చేసి, ప్రయాణికుడు తన రిజర్వేషన్ టికెట్ పై ఉన్న PNR నెంబర్ చెప్పి, దిగాల్సిన రైల్వేస్టేషన్ పేరు ధ్రువీకరించుకోవాలి. ఇదీ చదవండి: వీడియో: ఇదేమైనా సినిమా హాలు అనుకుంటున్నారా? IAS అధికారిని ఏకిపారేసిన జడ్జి! దీంతో ప్రయాణికులు దిగాల్సిన స్టేషన్ రావడానికి 20 నిమిషాల ముందే ప్రయాణికుడు మొబైల్ కు కాల్ వచ్చి.. వారి అలర్ట్ చేస్తుంది. అయితే ఈ సదుపాయం కేవలం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జామున 7గంటల వరకు మాత్రమే ఉంటుంది. కొత్తగా తీసుకొచ్చిన ఈ ఫీచర్ రాత్రి వేళల్లో ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. మరి.. రైల్వే శాఖ తీసుకొచ్చిన ఈ అలర్ట్ ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.