సర్కారు వారి పాట.. మే 12న థియేటర్లలో విడుదల జరిగి మంచి టాక్ సొంతం చేసుకుంది. మహేశ్ ఇటీవల తీసిన సినిమాల్లో ఈ మూవీలోనే అసలు సిసలైన మాస్ ఎలిమెంట్ కనిపించిందంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మహేశ్ బాబు లుక్స్, డైలాగ్ డెలివరీ అయితే పోకిరి గుర్తు చేసిందంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ముహూర్తం నుంచి లీకుల బెడదతో సతమతమయ్యింది. పోస్టర్, సాంగ్ మేకింగ్, సాంగ్స్ ఇలా అన్నీ అఫీషియల్ రిలీజ్ కు ముందే నెట్టింట ప్రత్యక్ష మయ్యాయి. లీకుల వీరులను కట్టడి చేయలేక నిర్మాణ సంస్థ సైతం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇదీ చదవండి: మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ మూవీ రివ్యూ! అయితే ఇప్పుడు సినిమా విషయంలో మాత్రం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. సాధారణంగా సినిమాలు విడుదల అవ్వగానే పైరసీ వెబ్ సైట్లలో ప్రత్యక్షమవుతుంటాయి. అలా సర్కారు వారి పాట సినిమా కాకూడదని మైత్రీ మూవీ మేకర్స్ ముందే జాగ్రత్తలు చేపట్టారు. యాంటీ పైరసీ సెల్ ఒకటి ఏర్పాటు చేశారు. ఎక్కడైనా పైరసీ మూవీ కనిపిస్తే ఆ లింకులు తమ కంట్రోల్ రూమ్ కు పంపాలంటూ వాట్సాప్ నంబర్లు ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన వివరాలను తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎక్కడైనా పైరసీ లింకులు, వీడియోలు కనిపిస్తే తమకు వాట్సాప్ చేయాలంటూ 89786 50014, 99124 25159, 88811 08888 ఈ నంబర్లను పోస్ట్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ తీసుకున్న ఈ ముందు జాగ్రత్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. #SarkaruVaariPaata Anti Piracy Control Room: Report piracy at claims@antipiracysolutions.org Whatsapp: 8978650014 9912425159 8881108888 — Mythri Movie Makers (@MythriOfficial) May 11, 2022 మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.