రిలయన్స్ జియో.. టెలికాం రంగంలో ఈ పేరు సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఇవాళ దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగింది అంటే.. దానికి కారణం జియోనే. జియో.. రాకముందు మొబైల్ వినియోగదారులు ఎక్కువగా.. ఎయిర్ టెల్ ను ఆశ్రయించేవారు. నెలకు 100 రూపాయలు పెడితే కానీ, 1 జీబీ డేటా వచ్చేది కాదు.. అది కూడా నెల వ్యాలిడిటీ. రోజుకింత 'ఎంబీ' చొప్పున ఆచి.. తూచి.. వాడుతూ నెల మొత్తం గడిపేవాళ్లం. కానీ, జియో వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అడిషనల్ డేటా ప్లాన్స్ లో 10 రూపాయలకు 1 జీబీ డేటా అందిస్తున్నా.. అన్ లిమిటెడ్ ప్లాన్స్ లో అంతకంటే తక్కువ ధరకే అందిస్తోంది. ఇదిలా ఉంటే.. జియో మరో అఫర్ తో వినియోగదారుల ముందుకొచ్చింది. టాప్ కొన్నవారికి 100 జీబీ డేటా ఫ్రీ అని ప్రకటించింది. ఇంతకీ ఈ ఆఫర్ ఏంటి.. దీనికి ఎవరు అర్హులు అన్న విషయాల ఇప్పుడు తెలుసుకుందాం. రిలయన్స్ జియో, హెచ్‌పి సంస్థతో కలిసి ఈ ఆఫర్‌ను ప్రకటించింది. హెచ్‌పి స్మార్ట్ LTE ల్యాప్‌టాప్ కొన్న వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంతేకాదు.. ఈ ల్యాప్‌టాప్ ని ఆఫ్‌లైన్‌లో అయితే.. రిలయన్స్ డిజిటల్లో ఆన్లైన్ లో అయితే.. reliancedigital.in లేదా JioMart వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయాలి. ఈ ఆఫర్ కింద మీకు రూ. 1,500 విలువైన 100జీబీ హై స్పీడ్ ఇంటర్నెట్ ఉచితంగా అందిస్తారు. దీని వ్యాలిడిటీ 365 రోజులు. ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందడానికి మీరు కొత్త జియో సిమ్ కోసం సబ్స్క్రయిబ్ చేసుకోవాలి. డేటా వ్యాలిడిటీ గడువు ముగిసేలోపు 100జీబీ డేటా అయిపోయినట్లయితే ఇంటర్నెట్ వేగం 64కేబీపీఎస్ కు తగ్గుతుంది. మీరు HP స్మార్ట్ SIM ల్యాప్‌టాప్‌ను ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేస్తే HP Smart LTE 100GB ఆఫర్లో కొత్త Jio SIMని యాక్టివేట్ చేయమని మీరు రిలయన్స్ డిజిటల్ సిబ్బందిని అడగండి. ఆన్లైన్ లో కొనుగోలు చేస్తే దగ్గరలోని రిలయన్స్ డిజిటల్ ను సంప్రదించడండి. ఈ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Jio HP Smart SIM laptop offer pic.twitter.com/JSnhFTCyGU — Govardhan Reddy (@gova3555) July 18, 2022 ఇదీ చదవండి: పిల్లల కోసం పొదుపుచేయాలనే వారికి గుడ్ న్యూస్.. రూ. 32 లక్షలు పొందే ప్రయోజనం! ఇదీ చదవండి: Smart TV: మీ పాత టీవీ ఎక్స్ఛేంజ్ చేస్తే.. రూ.22వేల విలువైన స్మార్ట్ టీవీ రూ.4999కే!