యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయంలో అడవి పంది కలకలం సృష్టించింది. శనివారం ఉదయం క్యూకాంప్లెక్స్ లో కాసేపు అటూ ఇటూ పరిగెత్తింది. ఇక ఈ క్రమంలో అక్కడి భక్తుల అరుపులకు భయపడిన పంది.. తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో క్యూ కాంప్లెక్స్ భవనం పై అటు ఇటు పరిగెత్తింది. ఆ పందిని పట్టుకునేందుకు ఎస్పీఎఫ్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికి వారికి చిక్కకుండా క్యూకాంప్లెక్స్ వీధుల్లో పరిగెత్తింది. వారి నుంచి తప్పించుకునే క్రమంలో భవనంపై నుంచి పడి చనిపోయింది. పంది కళేబరాన్ని ఎస్పీఎఫ్ సిబ్బంది తొలగించారు. అయితే అడవి పంది ఆలయ మాడవీధుల్లోకి రావడం భక్తులు అపశృతిగా భావించారు. స్వామి వారి ఆలయ మాడవీధుల్లో పంది చనిపోవడం దేనికి సంకేతం అని కొందరు భక్తులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అడవి పంది తిరిగి ప్రాంతమంతా లఘు పుణ్యవచనం చేస్తే సరిరపోతుందని అర్చకులు తెలిపారు. ఆలయ మాడవీధుల్లో లఘు పుణ్యవచనం చేపడతామన్నారు ఆలయ ఆర్చకులు. దీని కోసం దర్శనాలు నిలిపివేయాల్సి అవసరం లేదని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: వీడియో: జలాశయంలోకి దూకిన ఆవుల మంద.. ఎందుకంటే! ఇదీ చదవండి: విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత.. గవర్నర్ తమిళిసై వైద్యం!