వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన వివాదాలు రాజేయడమే కాక.. మిగతా వారితో కూడా అలాంటి పనులే చేయిస్తారు. తాజాగా మరోసారి అలాంటి పనితో తెలంగాణలో పెద్ద వివాదాన్నే రాజేశారు ఆర్జీవీ. ఏకంగా అధికారి పార్టీ మంత్రిని అరేయ్ అని తిట్టించడమే కాక.. ఆ వీడియోని తన ట్విటర్ లో షేర్ చేశాడు. ఆ వివరాలు.. ప్రస్తుతం ఆర్జీవీ.. కొండా మురళి-సురేఖ దంపతుల మీద కొండా సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొండా సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశాడు. అయితే కొండా సినిమా విడుదలను ఆపడానికి టీఆర్‌ఎస్ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ట్రైలర్ విడుదలను ఆపాలంటూ పలువురు టీఆర్‌ఎస్ నాయకులు.. ఆర్జీవీకి కాల్ చేసి బెదిరించారట. దాంతో చిర్రెత్తుకొచ్చిన ఆర్జీవీ.. ఏకంగా కొండా సురేఖతో వారందరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇప్పిస్తూ ఓ వీడియోని తన ట్విటర్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. pic.twitter.com/NmSznqsAu0 — Ram Gopal Varma (@RGVzoomin) January 25, 2022 ఈ వీడియోలో కొండా సురేఖ టీఆర్‌ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చల్లా ధర్మారెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘అరేయ్ ధర్మరెడ్డిగా, దయాకర్ గా అరచేతిని అడ్డుపెట్టి.. సూర్యుడిని ఆపలేరు.. అలానే మీరు ఎన్ని చేసినా.. కొండా సినిమా ట్రైలర్ రిలీజ్ ఆగదు’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆర్జీవీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చల్లా ధర్మారెడ్డికి వ్యతిరేకంగా ఉండటంతో వారు సినిమాను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. కొండా ట్రైలర్ 24 గంటల వ్యవధిలో 2 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతుంది.