టీఆర్‌ఎస్ మంత్రుల్లో హరీశ్ రావుది ప్రత్యేక ప్రస్థానం. ట్రబుల్ షూటర్ అని పార్టీలో ఆయనకు పేరు. సొంత నియోజవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏ శాఖ బాధ్యతలు అప్పగించిన సరే.. దానికి నూటికి నూరు శాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తారు. మృదు స్వభావి కావడంతో.. పార్టీలకు అతీతంగా ఆయనను అభిమానిస్తారు. ఇక కష్టం అని ఆయన దృష్టికి వస్తే చాలు వెంటనే స్పందిస్తారు. తాజాగా హరీశ్ రావుకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. తన జీవితంలో ఎదురైన ఓ సంఘటనను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఆ వివరాలు.. కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో జనాలు సొంత ఊర్లకు పయనమయ్యారు. వాహనాలు లేవు.. కాళ్లను నమ్ముకుని వందల కిలోమీటర్లు నడుస్తూ ప్రయాణం కొనసాగించారు. అయితే ఆ పరిస్థితుల్లో ప్రభుత్వాలు, నాయకులు, స్వచ్ఛందంగా అనేక మంది ముందుకు వచ్చి వారికి సహాయం చేసి అక్కున చేర్చుకున్నారు. మంచి నీరు, ఆహారం అందించి ఆదుకున్నారు. ఇది కూడా చదవండి : ఆ కుట్రలకే హరీశ్‌రావు బలి అవుతారు! ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్ ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌కు చెందిన ఏడు నెలల గర్భవతి హైదారాబాద్ నుంచి తుప్రాన్ మీదుగా రామాయంపేట్‌కు సుమారు 80 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తుంది. ఆమె ఎక్కువ కిలోమీటర్లు నడవడంతో రక్తస్రావం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన స్థానిక రామాయం పేట్ సీఐ నందీశ్వర్ గౌడ్ ఆ మహిళ బాధను చూసి, మంత్రి హరీష్‌రావుకు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని కోరినట్టు తెలిపారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి వెంటనే మెడికల్ కాలేజి సూపరిండెంట్‌కు ఫోన్ చేసి అంబులెన్స్‌ను పంపించి ఆమెను హుటాహుటిన సిద్దిపేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆమె ప్రాణాలు కాపాడినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి : హరీష్ రాగానే దళిత మంత్రిని అవమానించారు- ప్రవీణ్ కుమార్ ట్వీట్ అనంతరం ఆమెను ప్రభుత్వ అంబులెన్స్ లో క్షేమంగా మధ్యప్రదేశ్ లోని ఆమె స్వగ్రామానికి చేర్చామని మంత్రి హరీశ్ రావు గుర్తు చేసుకున్నారు. దీని గురించి తెలుసుకున్న మధ్యప్రదేశ్ సీఎంఓ కార్యాలయం తనకు రెండు సార్లు కాల్ చేసి.. ధన్యవాదాలు తెలిపారన్నారు. అయితే.. నాడు ఆ మహిళ అనుభవించిన కష్టాన్ని వర్ణించడానికి మాటలు చాలవని గుర్తు చేసుకుంటూ.. హరీశ్ రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు మంత్రి హరీశ్ రావుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.