గత కొంత కాలంగా తెలంగాణలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా టీ కాంగ్రెస్ లో వలసల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. త్వరలో ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మరో కాంగ్రెస్ కీలక నేత దాసోసు శ్రవణ్ సైతం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు మరో నేత కూడా కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే జయసుధతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ఈసారి ఖచ్చితంగా అధికారం చే జిక్కించుకోవాలని బీజేపీ విశ్వప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా బీజేపీలో పలు పార్టీల కీలక నేతలు చేరుతున్నారు. ముఖ్యంగా టి కాంగ్రెస్ కి చెందిన ముఖ్యనేతలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధతో బీజేపీ పార్టీ సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం అందుతోంది. బీజేపీలో చేరాలని ఆమెను కొందరు నేతలు కోరినట్లు తెలుస్తోంది. గతంలో సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గా గెలిచిన జయసుధ గెలిచిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. బీజేపీ నేతల సంప్రదింపులు.. పార్టీలో చేరే విషయం పై జయసుధ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక దీనిపై నటి జయసుధ ఏ నిర్ణయం తీసుకోనుందో.. ఆమె ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది చదవండి: తెలుగు యువకుడి ప్రతిభ.. ఇంటెల్ లో రూ.2 కోట్ల వార్షిక వేతనంతో కొలువు! ఇది చదవండి: ఖాళీ పాల ప్యాకెట్లు ఇస్తే పెట్రోల్ పై డిస్కౌంట్! ఎక్కడంటే..