శాంసంగ్ కంపెనీ నుంచి అత్యంత పవర్ఫుల్ ఫోల్డింగ్ ఫోన్ విడుదలైన విషయం తెలిసిందే. ఎన్నో అద్భుతమైన ఫీచర్లతో భారత్ సహా గ్లోబల్ మార్కెట్లోకి శాంసంగ్ Z ఫోల్డ్ 4ని విడుదల చేశారు. దీనిలో 7.6 ఇంచెస్ డిస్ ప్లే, 6.2 ఇంచెస్ హెచ్డీ+ఆమోలెడ్ 2x కవర్ డిస్ ప్లేతో వస్తోంది. అంతేకాకుండా ఈ ఫోల్డ్ z4లో 5 పవర్ ఫుల్ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 8+జెన్1 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ, 12 జీబీ ర్యామ్+ 256 స్టోరేజ్, 12 జీబీ+ 512జీబీ స్టోరేజ్, 12 జీబీ + 1 టీబీ వేరియంట్లలో లభిస్తోంది. విదేశాల్లో దీని ధరను సుమారు రూ.1.42(1,799 డాలర్లు) లక్షలుగా నిర్ణయించారు. అయితే భారత్‌లో ఈ ఫోన్ ఎలా లేదన్నా రూ.1.60 లక్షలు వరకు ఉండచ్చని అంచనాలు వేస్తున్నారు. Great is now going greater! RT right away OR ❤️ this tweet to catch the immersive product demo and exclusive offers on #GalaxyZFold4 and #GalaxyZFlip4 - Samsung Live on August 16, 2022 at 12 PM. #Samsung pic.twitter.com/9OQPXBoKUc — Samsung India (@SamsungIndia) August 12, 2022 అయితే ఇప్పుడు ఈ శాంసంగ్ Z4 ఫోల్డ్ ఫోన్ కి పోటీగా షావోమీ తమ ఫోల్డ్ ఫోన్ ని చైనా మార్కెట్లో రిలీజ్ చేసింది. చూడటానికి కూడా దాదాపు శాంసంగ్ ఫోల్డ్ ఫోన్ డిజైన్‌నే పోలి ఉన్న షావోమీ మిక్స్ ఫోల్డ్ 2 కచ్చితంగా గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు. ఈ షావోమీ మిక్స్ ఫోల్డ్ 2 ఫోన్ చాలా లైట్ వెయిట్ డిజైన్‌గా తయారు చేశారు. అంతేకాకుండా స్పెసిఫికేషన్స్ కూడా దాదాపు గ్యాలెక్సీ ఫోల్డ్ z4కి దగ్గరగా ఉన్నాయి. Xiaomi Mix Fold 2 price and specifications.#Xiaomi #XiaomiMixFold2 pic.twitter.com/cL8aK2zehk — Mukul Sharma (@stufflistings) August 11, 2022 ఇది 8.02 ఇంచెస్ ఇంటర్నల్ డిస్ప్లేతో వస్తోంది. 6.65 ఇంచెస్ ఎక్సటర్నల్ డిస్ ప్లేతో అందిస్తున్నారు. 12 ఆండ్రాయిడ్ సిస్టమ్ తో వస్తోంది. ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో రన్ అవుతుంది. ఇది ఏ మోడల్ అయినా 12 జీబీ ర్యామ్ తోనే వస్తోంది. కానీ, స్టోరేజ్ లో మాత్రం 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ వేరియంట్లలో లభిస్తోంది. 50ఎంపీ, 13 ఎంపీ, 8 ఎంపీ, 20 మెగాపిక్సల్ కెమెరాలతో వస్తోంది. Xiaomi has also launched their foldable device. The Mix Fold 2. Decent specs but one of the ugliest looking foldables yet, what is that camera monstrosity at the back pic.twitter.com/AoMcbkHlLq — OoF (@NigelJr_) August 11, 2022 ఇది 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో లభిస్తోంది. ఈ ఫోన్ రూ.1.06 లక్షల ప్రారంభ ధరలో, బ్లాక్, గోల్డ్ కలర్ వేరియంట్లలో లభిస్తోంది. అయితే ఈ ఫోన్ తప్పకుండా డిజైన్, స్పెసిఫికేషన్స్, ధర, లుక్స్ ఏ రకంగా చూసుకున్న శాంసంగ్ ఫోల్డ్ Z4కి పోటీ అవుతుందంటూ టెక్ వర్గాలు చెబుతున్నాయి. షావోమీ మిక్స్ ఫోల్డ్ 2 ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. OH MY WORD the @Xiaomi Mi Mix Fold 2 looks FANTASTIC pic.twitter.com/jcnDi9jF9u — Danny Winget (@superscientific) August 11, 2022 ఇదీ చదవండి: పండగ ఆఫర్లు: కార్లపై డిస్కౌంట్లు ప్రకటించిన పలు ప్రముఖ కంపెనీలు! ఇదీ చదవండి: స్మార్ట్‌టీవీ మార్కెట్ లో సంచలనం.. 15 వేల ధరలో 50 ఇంచెస్ స్మార్ట్‌టీవీ!