Phones: భారత్ మొబైల్ ఫోన్ల వినియోగదారులకు అడ్డగా మారింది. ఇక్కడి జనం మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చిన ప్రతీ ఫోన్‌ను వినియోగిస్తూ ఉన్నారు. మెచ్చిన వాటికి పట్టం కడుతూ.. నచ్చని వాటిని పక్కన పడేస్తున్నారు. ప్రతీ నెలా దేశ వ్యాప్తంగా వందల కోట్ల బిజినెస్ జరుగుతోంది. అందుకే చోటా మోటా ఫోన్ కంపెనీ భారత్‌ను ఓ పెద్ద మార్కెట్‌గా భావిస్తున్నారు. తమ ఫోన్లను ఇక్కడ సేల్ చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు. గత ఏప్రిల్, మే నెలలల్లో ప్రముఖ బ్రాండ్లనుంచి కొత్తకొత్త ఫోన్లు మార్కెట్‌లోకి వచ్చాయి. అయితే, ఈ నెలలో చెప్పుకోదగినంతగా కొత్త ఫోన్లు లాంఛ్ కాలేదు. ఇక, వచ్చే జులై నెలలో పెద్ద సంఖ్యలో ప్రముఖ బ్రాండ్ల ఫోన్లు లాంఛ్ కానున్నాయి. వాటిపై ఓ లుక్ వేద్దాం.. జులైలో ఇండియన్ మార్కెట్‌లోకి రానున్న కొత్త ఫోన్లు నథింగ్ ఫోన్ 1 : నథింగ్ కంపెనీ నుంచి ఇండియాలో లాంఛ్ కాబోతున్న మొదటి ఫోన్ ఇది. జులై 12న ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన డిజైన్‌ను కంపెనీ ఇప్పటికే విడుదల చేసింది. నథింగ్ ఫోన్ల ధర రూ.41వేల నుంచి ప్రారంభం కానుంది. వన్‌ప్లస్ నార్డ్ 2టీ వన్‌ప్లస్ నుంచి వస్తున్న కొత్త మోడల్ ఇది. ఈ మోడల్ జులై 1న ఇండియన్ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మోడల్‌కు సంబంధించిన టీజర్ ప్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే విడుదలైంది. వన్‌ప్లస్ నార్డ్ 2టీ ధర రూ. 28,999గా ఉంది. షియోమీ 12 అల్‌ట్రా షియోమీ కంపెనీ నుంచి వస్తున్న మరో మోడల్ ఇది. ఈ ఫోన్ జులై 5న అందుబాటులోకి రానుంది. ఈ మోడల్‌తో పాటు షియోమీ 12ఎస్, షియోమీ 12ఎస్‌ప్రో ఫోన్లు కూడా జులైన అందుబాటులోకి రానున్నాయి. ఇక, షియోమీ 12 అల్‌ట్రా ధర 69,990గా ఉంది. అసుస్ రోగ్ ఫోన్ 6 ప్రముఖ కంపెనీ అసుస్ నుంచి వస్తున్న అసుస్ రోగ్ ఫోన్ 6.. ఓ గేమింగ్ ఫోన్. ఈ గేమింగ్ ఫోన్ జులై 5న ఇండియన్ మార్కెట్‌లో లాంఛ్ కానుంది. దీని ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఇవి కూడా చదవండి : న్యూ లుక్‌తో మార్కెట్‌లో అడుగు పెట్టిన Scorpio-N.. ప్రారంభ ధర ఎంతంటే?