Samsung Galaxy S23 Ultra: ఎవరైనా కొత్త ఫోన్ కొనాలకున్నప్పుడు ఆలోచించే రెండే రెండు ప్రశ్నలు.. ఒకటి.. ఫోన్ ప్రాసెసర్ ఎంత? మరొకటి.. కెమెరా ఎలా ఉంది?. మన దైనందిన జీవితంలో ఎక్కడికి వెళ్లినా మనతో ఉండేది ఈ స్మార్ట్ ఫోనే. మన జీవితంలోని బెస్ట్ మూమెంట్స్ అయినా, సరదాగా స్నేహితులను తీసుకునే ఫొటోలు అయినా బాగా రావాలంటే మన స్మార్ట్ ఫోన్ లో మంచి కెమెరా ఉండటం తప్పనిసరి. అలాగే.. గేమింగ్ ఇష్టపడే వారు.. ప్రాసెసర్ పై శ్రద్ధ చూపుతారు. ఇలాంటి అదిరిపోయే ప్రాసెసర్ తో పాటు.. 200 మెగాపిక్సల్ కెమెరాతో శాంసంగ్ నుంచి కొత్త ఫోన్ రాబోతోంది. శాంసంగ్ గెలాక్సీ నుంచి అదిరే ఫీచర్లతో కొత్త ఫోన్ రాబోతుంతదని ప్రముఖ కొరియా ఐటీ వార్తా సంస్థ వెల్లడించింది. దానిలో 200ఎంపీ కెమెరా ఉంటుందని తెలిపింది. ఇది మార్కెట్లోకి వస్తే 200ఎంపీ కెమెరాతో వచ్చిన మొదటి మొబైల్ ఇదే కానుంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, శాంసంగ్ గెలాక్సీ జెడ్ 4 పోల్డ్.. ఫోల్డబుల్ ఫోన్లను ఈ నెల 16న మార్కెట్లో విడుదలచేసింది. ఈ క్రమంలో అందరి దృష్టి వచ్చే గెలాక్సీ మోడల్‌పైనే ఉంది. వచ్చే ఏడాది మార్కెట్లోని రానున్న గెలాక్సీ ఎస్ 23 ఫోన్లో 200ఎంపీ కెమెరాతో.. మరెన్నో అదిరిపోయేరు ఫీచర్లున్నట్లు తెలుస్తోంది. స్పెసిఫికేషన్స్(అంచనా): 6.8 ఇంచెస్ డిస్‌ప్లే విత్ 3088 x 1440 పిక్సెల్ రిజల్యూషన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 200 ఎంపీ కెమెరా + 8K వీడియో రికార్డర్ ఫ్రంట్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఆండ్రాయిడ్ 13, ఓఎస్ 5 5,000mAh బ్యాటరీ It has been reported that Samsung has confirmed with its manufacturing partners that the Galaxy S23 Ultra phone will sport a 200 MP main camera sensor. In addition, it is also believed the Samsung Galaxy S23 Ultra will also utilize Qualcomm’s 3D Sonic Max fin… pic.twitter.com/S4JxXcIyrG — Rohit Chouhan (@itsrohitchouhan) August 21, 2022 ఇదీ చదవండి: Nothing Phone 1: క్రేజ్ పెరిగాక.. నథింగ్ ఫోన్ కు పెరిగిన రేటు.. ఎంతంటే? ఇదీ చదవండి: OnePlus: వన్‌ప్లస్ కొనాలంటే ఇదే మంచి అవకాశం.. 25 శాతం వరకు భారీ డిస్కౌంట్లు!