'వన్‌ప్లస్'.. ప్రీమియం స్మార్ట్ఫోన్లకు పెట్టింది పేరు. గతంలో ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ల ధర 35 నుంచి 40 వేలపైనే ఉండేది. అయితే.. అందరకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో వన్‌ప్లస్ సంస్థ.. నార్డ్ సిరీస్ ద్వారా రూ.25,000 సెగ్మెంట్లో స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది. దీంతో వన్‌ప్లస్ ఫోన్లకు భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో మంచి ఆదరణ లభించింది. దీంతో వన్‌ప్లస్ సంస్థ మరో మెట్టు దిగి 20వేల లోపు బడ్జెట్లో మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుందని గతకొంత కాలంగా వార్తలొచ్చాయి. అందరూ ఊహించినట్టుగానే 20వేలలోపు బడ్జెట్లో మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది వన్‌ప్లస్ సంస్థ. రూ.19,999 ధరలో 'వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ' మోడల్‌ను రిలీజ్ చేసింది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999గా ఉంది. బ్లాక్ డస్ట్, బ్లూ టైడ్ కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,500 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. కంపెనీ అధికారిక వెబ్ సైట్, రిటైల్ స్టోర్స్, అమెజాన్ ద్వారా ఏప్రిల్ 30 నుంచి అందుబాటులో ఉంటుందని వన్‌ప్లస్ తెలిపింది. OnePlus Nord CE 2 Lite 5G will feature dual view video and nightscape mode.#OnePlus #OnePlusNordCE2Lite5G pic.twitter.com/A4Jd8IjKWP — Mukul Sharma (@stufflistings) April 22, 2022 వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ స్పెసిఫికేషన్స్ 6.59 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ 64 ఎంపీ+ 2 ఎంపీ+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఆండ్రాయిడ్ 12 + ఆక్సిజన్ ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టమ్ 5జీ సపోర్ట్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ 33 వాట్ Super VOOC ఛార్జింగ్ If you know all about the new OnePlus Nord CE 2 Lite 5G then you stand a chance to take one home. Match all the specs of the phone and share your answer with #OnePlusNordCE2Lite5GOnAmazon to win!#AmazonSpecials pic.twitter.com/TCymzr5dcu — Amazon India (@amazonIN) April 29, 2022 మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.