వన్‌ప్లస్ ఫోన్లకు మన దగ్గర ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ నార్డ్ సిరీస్ మొబైల్స్ అంటే జనాలు ఎగబడి మరీ కొంటున్నారు. ఇలాంటి సమయంలో వినియోగదారులకు మరింత చేరువ అవ్వాలనే ఉద్దేశ్యంతో వన్‌ప్లస్ సంస్థ ఇయర్ బడ్స్ మార్కెట్‌పై దృష్టిసారించింది. వరుసగా ఇయర్‌బడ్స్ మోడల్స్ ను విడుదల చేస్తూ యూజర్లను పెంచుకుంటోంది. ఈ క్రమంలో చౌకైన 'నార్డ్ సీఈ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్' ను లాంచ్ చేసింది. సాదారణంగా భారత మార్కెట్లో.. లో కాస్ట్, మిడ్ రేంజ్ ప్రొడక్ట్స్‌కు అధిక డిమాండ్ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరలోనే ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. ఫీచర్ల విషయంలో కూడా ఎక్కడా రాజీపడకుండా వీటిని రూపొందించడం విశేషం. 13.4 మిల్లీమీటర్ల డ్రైవర్స్‌ను ఈ నార్డ్ బడ్స్ కలిగి ఉన్నాయి. మొత్తంగా చార్జింగ్ కేస్‌తో కలిపి 20 గంటల ప్లేటైమ్ ఉంటుంది. రెండు కలర్ ఆప్షన్‌లలో వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ సీఈ TWS ఇయర్‌బడ్స్ లాంచ్ అయ్యాయి. గేమింగ్ కోసం లో ల్యాటెన్సీ మోడ్‌కు కూడా సపోర్ట్ చేస్తాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ ఇయర్‌బడ్స్ ధర: వన్‌ప్లస్ నార్డ్ సీఈ బడ్స్ ఇంట్రడక్టరీ ధర రూ.2,299గా ఉంది. ఫ్లిప్‌కార్ట్, వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈనెల 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ బడ్స్ సేల్‌కు రానున్నాయి. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వన్‌ప్లస్ వెల్లడించింది. అయితే ఈ ఇంట్రడక్టరీ ధర ఎంతకాలం ఉంటుందో వన్‌ప్లస్ వెల్లడించలేదు. వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ అసలు ధర రూ.2,699గా ఉంది. మూన్‌లైట్ వైట్, మిస్ట్ గ్రే కలర్ ఆప్షన్స్‌లో ఈ బడ్స్ అందుబాటులో ఉండనున్నాయి. OnePlus Nord Buds CE launched in India for Rs 2,299.#OnePlus #OnePlusNordBudsCE pic.twitter.com/v7es9BVu5G — Mukul Sharma (@stufflistings) August 1, 2022 స్పెసిఫికేషన్స్: 13.4 మిల్లీమీటర్ల టైటానియం డైనమిక్ డ్రైవర్లతో వన్‌బడ్స్ నార్డ్ బడ్స్ సీఈ ఇయర్‌బడ్స్ వస్తున్నాయి. బాస్‌ను 3డెసిబుల్స్ వరకు పెంచే "ప్రత్యేకమైన క్లోజ్డ్-ట్యూబ్ డిజైన్" ఉంది. 20Hz నుంచి 20,000Hz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంటుంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.2 వెర్షన్‌ను ఈ బడ్స్ కలిగి ఉన్నాయి. రేంజ్ 10 మీటర్ల వరకు ఉంటుంది. కాల్స్ కోసం ఏఐ క్యాన్సలేషన్ టెక్నాలజీ ఉంటుంది. ఫుల్ చార్జ్‌పై 50 శాతం వాల్యూమ్‌తో వినియోగిస్తే ఈ వన్‌ప్లస్ బడ్స్ 4.5 గంటల ప్లే టైమ్ ఇస్తాయి. చార్జింగ్ కేస్‌తో మరో నాలుగుసార్ల వరకు బడ్స్‌ను చార్జ్ చేసుకోవచ్చు. మొత్తంగా కేస్‌తో కలిపి ఈ బడ్స్ 20 గంటల ప్లే టైమ్‌ను ఇస్తాయి. అలాగే 10 నిమిషాల చార్జింగ్‌తోనే 81 నిమిషాలు ప్లేబ్యాక్ టైమ్ ఇచ్చేలా ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను వన్‌ప్లస్ నార్డ్ సీఈకు ఇస్తున్నట్టు వన్‌ప్లస్ పేర్కొంది. చార్జింగ్ కోసం కేస్‌కు టైప్-సీ పోర్ట్ ఉంటుంది. మొత్తంగా ఒక్కో బడ్‌లో 27mAh బ్యాటరీ, చార్జింగ్ కేస్‌లో 300mAh బ్యాటరీ ఉంది. OnePlus Nord Buds CE Moonlight White Box content: 1 Pair of Earbuds with Charging Case, User Guide, Safety and Warranty Card, Brand Sticker, Charging Cable, Red Cable Club Welcome Card Bluetooth range: 10m 35.92x18.47x17.02mm 20 hours play time#OnePlus #OnePlusNordBudsCE pic.twitter.com/UHVLcgfTqg — Mukul Sharma (@stufflistings) July 31, 2022 స్మార్ట్‌ఫోన్‌లో హేమెలోడీ (HeyMelody) యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని వన్‌ప్లస్ నార్డ్ సీఈ బడ్స్‌ను సింక్ చేసుకోవచ్చు. ఈక్వలైజర్, కంట్రోల్స్ మార్చుకోవచ్చు. ఒక్కో బడ్ బరువు 3.5 గ్రాములుగా ఉంది. చార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తంగా 33 గ్రాముల బరువు ఉంటుంది. ఇక.. వన్‌ప్లస్ నుంచి 'వన్‌ప్లస్ 10టీ' మోడల్ ఆగస్ట్ 3న లాంచ్ కానుంది. వన్‌ప్లస్ ఫోన్లలో తొలిసారిగా 16జీబీ ర్యాంతో 10టీ వస్తోంది. 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8+జెన్ 1 ప్రాససర్, 150వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్, సెంటర్ అలైన్డ్ పంచ్ హోల్‌తో పాటు, 369 డిగ్రీ యాంటెన్నా సిస్టమ్.. వంటి అద్భుతమైన ఫీచర్లతో రానుంది. ధర రూ 49,999 గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. OnePlus 10T - 6.7" 120 Hz Fluid OLED - Qualcomm Snapdragon 8+ Gen 1 - up to 16GB LPDDR5 RAM - up to 256GB UFS3.1 storage - Rear Cam: 50MP + 8MP + 2MP - Front Cam: 16MP - Android 12, OxygenOS 12.1 - 4,800mAh battery - 150W Fast charging Colors - Moonstone Black - Jade Green pic.twitter.com/jx2E33jBwm — Yogesh Brar (@heyitsyogesh) July 25, 2022 ఇదీ చదవండి: Upcoming Smartphones: ఆగష్టులో లాంచ్ కానున్న స్మార్ ఫోన్స్ లిస్టు ఇదే..!