ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు సార్లు వన్డే ఫార్మాట్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాకు వారి సొంతగడ్డపైనే భారీ షాక్ తగిలింది. క్రికెట్‌లో పసికూనగా పిలవబడే జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా చిత్తుచిత్తుగా ఓడింది. మూడు వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన జింబాబ్వే చివరి వన్డేలో అద్భుత విజయంతో సంచలనం సృష్టించింది. మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేద్దామనుకున్న ఆసీస్‌ను 2-1తో నిలువరించింది. కాగా.. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో జింబాబ్వే తొలి సారి ఓడింది. టౌన్స్‌విల్లే వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే.. ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ర్యాన్ బర్ల్ 5 వికెట్లతో చెలరేగడంతో.. ఆసీస్ 31 ఓవర్లలోనే చాపచుట్టేసింది. జింబాబ్వే బౌలర్ల ధాటికి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆసీస్.. 141 పరుగులకే కుప్పకూలింది. అందులో డేవిడ్ వార్నర్ ఒక్కడే 94 పరుగులు చేసి ఒంటిరి పోరాటం చేశాడు. ఇక లక్ష్యఛేనలకు దిగిన జింబాబ్వే 39 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్ తాడివానాషే మారుమని 47 బంతుల్లో 4 ఫోర్లలతో 35 పరుగులు చేసి రాణించాడు. మరో ఓపెనర్ కైతానో 25 బంతుల్లో 4 ఫోర్లు బాది 19 పరుగులతో జింబాబ్వేకు ఆరంభం అందించాడు. ఇక కెప్టెన్ రెగిస్ చకబ్వా 72 బంతుల్లో 3 ఫోర్లతో 37 పరుగులు చేసి చివరి వరకు క్రీజ్‌లో నిలిచి జింబాబ్వేకు అద్వితీయమైన విజయాన్ని అందించాడు. 5 వికెట్లతో అదరగొట్టిన ర్యాన్ బ్లర్ చివర్లో 11 పరుగులతో విలువైన ఇన్నింగ్స్ ఆడి కెప్టెన్‌కు సహకారం అందించాడు. గతంలో 2007లో టీ20 వరల్డ్ కప్‌లోనూ జింబాబ్వే ఆస్ట్రేలియాను 138 పరుగులకే కట్టడి చేసి ఆ మ్యాచ్‌లో గెలుపొందింది. ఇప్పుడు ఈ వన్డేలో కూడా ఆస్ట్రేలియాను 141కే ఆలౌట్ చేసిన జింబాబ్వే విజయం సాధించింది. కాగా.. ఆస్ట్రేలియాకు జింబాబ్వే అంటే ఇంకా భయం పోలేదా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. కొన్ని ఒక దశాబ్దం పాటు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఆస్ట్రేలియాకు పసికూనగా పేరున్న జింబాబ్వే మరోసారి షాక్ ఇచ్చింది. మరి ఈ మ్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: పాక్‌పై తేలిపోయిన హాంకాంగ్! టీమిండియా బౌలర్లపై తీవ్ర విమర్శలు RESULT: Zimbabwe won by 3 wickets (with 66 balls remaining) Zimbabwe 142/7 (39/50 ov, target: 142) v Australiahttps://t.co/NRyIyWOriW — ESPNcricinfo scores (@ESPNscorecard) September 3, 2022 History made for Zimbabwe: their 1st ever win on Australian soil Wonderful moment in their cricketing history We're seeing a resurgence for ZIM recently: winning 2-1 vs BAN, running IND close, & now winning an ODI in AUS. They deserve more opportunities against top sides ❤️ pic.twitter.com/VZQIAhHJd4 — Sivy Kanefied (@Sivy_KW578) September 3, 2022