సాధారణంగా పెళ్లైన ప్రతీ జంటకి పిల్లల్ని కనాలని, వారితో నోరారా అమ్మా.. నాన్నా.. అని పిలిపించుకోవాలని ఉంటుంది. అలాగే వారి బుడి.. బుడి అడుగులు చూసి మూరిసి పోవాలనిపిస్తుంది. పిల్లడ్ని ఎత్తుకుని ఆడించాలని ఉంటుంది. అలాంటిది తన కొడుకును తానే గుర్తుపట్టలేక పోతే..! అదీ ఓ స్టార్ క్రికెటర్ అయితే.. అవును మీరు విన్నది నిజమే. ఓ ఇండియన్ స్టార్ ఆటగాడు తన కొడుకునే గుర్తుపట్టకుండా‘ఎవరీ బుడ్డోడు’అంటూ అడిగాడు. ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. మరిఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. యువరాజ్ సింగ్.. భారత క్రీడాలోకంలోనే కాక ప్రపంచ క్రికెట్ లో ఈ పేరు తెలియని వారు ఉండరు. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వరల్డ్ కప్ లను భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. తరువాత ఫామ్ కొల్పోయి కొంత సతమతం అయ్యాడు. ఈ క్రమంలో 2016 నవంబర్ 30 న తన ప్రియురాలు అయిన హాజెల్ కీచ్ ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఓ ప్రముఖ మోడల్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది జనవరిలో యువరాజ్ దంపతులకు పండంటి మగబిడ్డ పుట్టాడు. ఇప్పుడు పిల్లాడికి ఆరు నెలలు పూర్తికావడంతో యూవీ భార్య కొడుకు ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఈవిధంగా స్పందించింది.. View this post on Instagram A post shared by Hazel Keech Singh (@hazelkeechofficial) ''అప్పుడే నా బంగారానికి ఆరు నెలలు వచ్చేశాయి. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది. నీ చేత అమ్మగా పిలిపించుకోవడం గొప్ప అదృష్టం. హ్యాపీ సిక్స్ మంత్స్ ఓరియెన్'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఈ ఫోటోపై చాలా మంది సెలబ్రిటీలు స్పందించారు. సానియా మీర్జా, నీతి మోహన్, యాక్టర్లు సత్యజిత్ దూబే, సాగరికా గాత్కే, క్రికెటర్ బెన్ కటింగ్ భార్య ఎరిన్ హాలండ్‌లు ఎమోజీలతో రిప్లై ఇచ్చారు. అయితే యువరాజ్ మాత్రం ''ఎవరీ బుడ్డోడు.. ఎవరి కొడుకు ఇతను ''అంటూ ఫన్నీగా కాప్షన్ పెట్టాడు. ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. యూవీ తన తనయుడిపై సరదాగా స్పందించిన తీరు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: Mark Zuckerberg: ఇంటిని అమ్ముకున్న జుకర్ బర్గ్.. కారణం ఇదేనా! ఇదీ చదవండి: KL Rahul: వెస్టిండీస్ తో టీ20 సిరీస్ కు కేఎల్ రాహుల్ దూరం..