కరేబియన్ జట్టుతో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడేందుకు టీమిండియా వెస్టిండీస్ వెళ్లిన విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి.. మూడు టీ20 మ్యాచ్‌లను కూడా ముగించింది. అందులో రెండు గెలిచి, ఒకటి ఓడి.. 2-1తో శనివారం జరిగే నాలుగో టీ20కి సిద్ధమైంది. కానీ.. ఇప్పటి వరకు జరిగిన మూడు వన్డేలు, మూడు టీ20లు వెస్టిండీస్‌లో ఆడిన టీమిండియా.. మిగిలిన రెండు టీ20లను అమెరికాలో ఆడనుంది. దీంతో ఇప్పటికే ఇరుజట్లు అమెరికాకు చేరుకున్నాయి. ఫ్లోరిడాలోని లాండర్‌హిల్‌లో గల సెంట్రల్ బ్రొవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. అమెరికా కాలమానం ప్రకారం.. ఉదయం 10:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. వెస్టిండీస్ టూర్‌కు వెళ్లిన భారత జట్టు మళ్లీ అమెరికాలో రెండు మ్యాచ్‌లు ఎందుకు ఆడుతుందనే అనుమానం క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. కాగా.. భారత్-వెస్టిండీస్ అమెరికాలో రెండు మ్యాచ్‌లు ఆడేందుకు ఒక మంచి కాజ్ ఉంది. అమెరికాలో క్రికెట్ అభివృద్ధి కోసం ప్రపంచ అగ్రశ్రేణి జట్లు అక్కడ క్రికెట్ ఆడుతున్నాయి. అమెరికాలో క్రికెట్‌కు ఆదరణ లేదన్న విషయం తెలిసిందే. అందుకే అమెరికాలో రెండు పెద్ద జట్ల మధ్య మ్యాచ్ జరిగితే అక్కడ కూడా క్రికెట్‌పై ఆసక్తి పెరిగి.. అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా క్రికెట్ అభివృద్ధి కోసం ఐసీసీ, బీసీసీఐ, విండీస్ బోర్డు ఈ విధంగా ప్లాన్ చేశాయి. కాగా లాండర్‌హిల్ పిచ్ పక్కా టీ20 ఫార్మెట్‌కు అనుకూలించేది. ఈ స్టేడియంలో ఇప్పటి వరకు కేవలం 13 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. కాగా ఇదే స్టేడియంలో భారత్-వెస్టిండీస్ 2016 నుంచి 2019 మధ్యకాలంలో రెండు మ్యాచ్‌లు కూడా ఆడాయి. మరి వెస్టిండీస్‌లో జరిగిన మూడు టీ20ల్లో రెండు గెలిచిన టీమిండియా.. ఇప్పుడు అమెరికాలో జరగబోయే నాలుగో మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. సిరీస్ సొంతం అవుతుంది. వెస్టిండీస్ గెలిస్తే.. 2-2తో సిరీస్ సమమై.. ఐదో టీ20తో సిరీస్ విజేత ఎవరో తేలుతుంది. మరి టీమిండియా నాలుగో మ్యాచ్‌తోనే తేల్చేస్తుందా? లేకా ఐదో మ్యాచ్ వరకు తీసుకెళ్తుందా చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Central Broward Regional Park cricket stadium is ready for the 4th T20 International between Ind vs Wi. pic.twitter.com/rDKrC1GZt1 — Cricket (@CricketByRaj) August 3, 2022 Hello from Florida, US! #TeamIndia | #WIvIND pic.twitter.com/VZkMYeclmr — BCCI (@BCCI) August 5, 2022