ఆసియాకప్-2022లో భాగంగా ఆదివారం ఇండియా పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ క్రీడాభిమానులు ఒంటికాలిపై నిల్చునేలా చేసింది. ఈ హై హోల్డేజ్ మ్యాచ్ లో పాక్ పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.నరాలు తెగే ఉత్కంఠభరిత పోరులో భారత్ ఆల్ రౌండర్ హార్ధిక పాండ్యా సిక్స్ కొట్టి జుట్టను విజయాన్ని అందిచాడు. దీంతో దేశ ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. జాతీయ జెండాలు పట్టుకుని వీధుల్లో సందండి చేశారు. అయితే ఇండియా గెలుపుపై పొరుగున ఉన్న ఆఫ్ఘానిస్థాన్ ప్రజలు కూడా సంబరాలు జరుపుకున్నారు. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ను ఆఫ్ఘానిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఓ ఆఫ్ఘాన్ యువకుడు క్రికెట్ మ్యాచ్ ను టీవీలో తిలకిస్తూ.. మ్యాచ్ ని గెలిపించిన హార్దిక్ పాండ్యాపై ముద్దుల వర్షం కురిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆసియా కప్-2022లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 147 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 148 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది. కేఎల్ రాహుల్ మొదటి ఒవర్లో రెండో బంతికే ఔటైయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన కోహ్లి మొదట ఒత్తిడికిలోనయ్యాడు. క్రీజులో కుదురుకున్న తరువాత పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మూడు ఫోర్లు, ఒక సిక్సర్ తో చూడ చక్కనైన బ్యాటింగ్ చేశాడు కోహ్లీ. చాలా రోజులుగా బ్యాటింగ్ లో తడబడుతున్న ఈ కింగ్ కోహ్లీ.. పాక్ పై అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో ఆయన అభిమానులు ఫుల్ కృషి అయ్యారు. టీవీల్లో కోహ్లి బ్యాటింగ్ చూస్తూ తెగ ఎంజాయ్ చేశారు. చివర్లో జడేజా, హార్దిక్ పాండ్యా మ్యాచ్ భారత్ వైపు తిప్పారు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలుత బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టగా.. అనంతరం బ్యాటింగ్‌లో కేవలం 17 బంతుల్లో 33 పరుగులు భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో హార్దిక్ పాండ్యా సిక్సర్ తో భారత్ కు విజయాన్ని అందించాడు. ఇది టీవీలో వీక్షించిన ఓ ఆప్ఘాని యువకుడు పాండ్యాపై ముద్దుల వర్షం కురిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Congratulations to all our brothers. Indians And Afghans. We the people Afghanistan celebrating this victory with or friend country indian people. #India #ViratKohli #pandya #INDvsPAK pic.twitter.com/FFI5VvKE0d — A H (@YousafzaiAnayat) August 28, 2022 ఇదీ చదవండి: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో వరల్డ్ రికార్డ్ సృష్టించిన రోహిత్ శర్మ ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ! భారత్ నుంచి తొలి క్రికెటర్‌గా..