రేపటి నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. కానీ.. ఆదివారం జరిగే అసలు సిసలైన క్రికెట్ యుద్ధం కోసమే అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. అదే ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్. ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా.. హైప్ ఒక రేంజ్‌లో ఉంటుంది. ఆటగాళ్లపై ఏదో తెలియని ఒత్తిడి, అభిమానుల్లో భారీ అంచనాలు, మ్యాచ్‌లో నరాలు తెగే ఉత్కంఠ.. పరుగు పరుగుకు మారిపోయే అభిమానుల భావోద్వేగాలు ఇలా భారత్-పాక్ మ్యాచ్ అంటేనే అదో రక్తం చిందని యుద్ధం. మ్యాచ్‌కు ముందు పరిస్థితి ఇలా ఉంటే మ్యాచ్ తర్వాత కూడా క్రికెట్ అభిమానుల్లో ఆ ఫీవర్ తగ్గదు. గెలిస్తే సంతోషంతో చర్చలు, పొగడ్తలు. ఓడితే మాత్రం మ్యాచ్‌పై తారాస్థాయికి చేరే విశ్లేషణలు, సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం, కొన్ని సార్లు క్రికెటర్ల ఇళ్లపై దాడులు కూడా జరుగుతాయి. భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్‌ను ఆటలా కాకుండా పరువుగా భావించడమే దీనంతటికీ కారణం. భారత్, పాకిస్థాన్ ఇరుదేశాల అభిమానులు మిగతా మ్యాచ్‌లను చూసే విధానం వేరు.. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌ను చూసే కోణం వేరు. ఈ దాయాదుల మధ్య ఉన్న వైరం ఈ పరిస్థితులకు మూలకారణం. ఇదే పరిస్థితి కొన్ని ఏళ్లుగా కొనసాగుతూ వస్తుంది. ఆటగాళ్లు మారినా, కొత్త అభిమానులు పుట్టుకొస్తున్నా.. భావోద్వేగాల్లో ఎలాంటి మార్పు ఉండదు. కొంతకాలం ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేని కారణంగా.. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే భారత్-పాక్ తలపడతున్నాయి. దీంతో ఏడాది కొకసారి వచ్చే పండుగలా తయారైంది పరిస్థితి. తాజాగా ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఎప్పటిలాగే క్రికెట్ అభిమానుల్లో మ్యాచ్‌పై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇదే విషయంపై టీమిండియా క్రికెటర్ మాజీ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ.. మేమంతా అన్నదమ్ముల్లా ఉంటామని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘భారత్-పాకిస్థాన్ జట్లు ఒక్కసారి గ్రౌండ్‌లోకి దిగితే.. పోటీ తారస్థాయిలోనే ఉంటుంది. మేమైనా, వాళ్లు అయినా సరే మంచి ప్రదర్శన కనబర్చాలనే కసితోనే ఆడతాం. ఎవరికి వాళ్లం తమ జట్లను గెలిపించాలని ఆడతాం. మ్యాచ్ ముగిసిన తర్వాత హోటల్‌కు వెళ్లి మ్యాచ్ సంగతి మర్చిపోయి కలిసిపోతాం. మా మధ్య అమితమైన ప్రేమానుబంధాలు ఉంటాయి. కానీ.. కొందరు తెలియక భారత్-పాక్ ఆటగాళ్ల మధ్య గొడవలు జరుగుతాయి అంటూ ఏవేవో మాట్లాడుతుంటారు. నిజానికి అలాంటి గొడవలేమి ఉండవు. మా మధ్య పోటీ, వైరం కేవలం మ్యాచ్ వరకే.. గ్రౌండ్ బయటికొస్తే మేమంతా మంచి ఫ్రెండ్స్.. నిజానికి అన్నదమ్ముల్లా కలిసిపోతాం.’ అని సెహ్వాగ్ అన్నాడు. సెహ్వాగ్ మాటలను నిజం చేస్తూ.. తాజాగా యూఏఈలో ప్రాక్టీస్ సందర్భంగా ఎదురుపడ్డ భారత్-పాక్ ఆటగాళ్లు ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. కోహ్లీ పాక్ కెప్టెన్ బాబర్ అజమ్, కోచ్ యూసుఫ్‌తో మాట్లాడిన వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అలాగే గాయం కారణంగా టోర్నీకి దూరమైన షాహీన్ అఫ్రిదీని దగ్గరికెళ్లి మరీ చాహల్, కోహ్లీ, పంత్ పరామర్శించడంతో వారి మధ్య మంచి స్నేహ వాతావరణం ఉన్న విషయం అర్థం అవుతుంది. కానీ.. అభిమానులు మాత్రం పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడితే మాత్రం అంత తేలిగ్గా జీర్ణించుకోలేరు. అలాగే భారత్ చేతిలో పాక్ ఓడినా ఆ దేశ అభిమానులు కూడా అంత తేలిగ్గా తీసుకోలేదు. ఇరు దేశ అభిమానుల్లో ఉన్న ఫీలింగ్ ఒకే విధమైంది.. మా దేశం గెలవాలి. కానీ.. ఆటలో గెలుపు కచ్చితంగా ఒక్కరికే దక్కుతుంది. రెండు జట్లు సమాన బలంతో ఉన్నా.. ఆ రోజు వారిచ్చే ది బెస్ట్ ప్రదర్శనపైనే వారి విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. మరి సెహ్వాగ్ చెప్పినట్లు ఆటను ఆటలా చూసి.. ఫ్యాన్స్ భావోద్వేగాలను నియంత్రించుకుంటారో.. లేక ఎప్పటి లాగే గెలిస్తే నెత్తిన పెట్టుకోవడం, ఓడితే దూషణలకు దిగడం చేస్తారో.. చూడాలి. మరి ఈ విషయంలో సెహ్వాగ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: ఆసియా కప్ టోర్నీలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచుల లెక్కలు ఇవే! Out of context IND vs Pak pic.twitter.com/sKHiSsRzlR — Out Of Context Cricket (@GemsOfCricket) August 26, 2022 Pak vs ind friendship moments #INDvPAK #BabarAzam #ViratKohli #AsiaCup2022 #shanewarne #PakVsInd #Asif #amir pic.twitter.com/4CEIaTw2Us — (@follow100billin) August 24, 2022 Are you ready for the biggest battle PAK vs IND on #28august ?#PakVsInd pic.twitter.com/KIMPAPfKuv — QirratSiddique|Imrankhan ❤️ (@Qirratsiddique) August 25, 2022 This is pak vs ind at its peak pic.twitter.com/OkEUjF7i7n — Hadiya (@dekhainjee) August 26, 2022