విరాట్ కోహ్లీ.. ఒకప్పటి పరుగుల యంత్రం. ప్రస్తుతం ఫామ్ కోల్పోయి మాజీల ఆగ్రహానికి సైతం గురవుతున్నాడు. రాణించకపోయినా అవకాశాలు కల్పిస్తున్నారంటూ బీసీసీఐ సెలక్టర్లపై కూడా పెదవి విరుస్తున్న వైనం చూస్తున్నాం. విరాట్ కు రోహిత్ శర్మ, సునీల్ గవాస్కర్, పాక్ కెప్టెన్ బాబర్ అజం, ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లెర్ ఇలా ఎంతో మంది బాసటగా నిలిచారు. విరాట్ తిరిగి ఫామ్ లోకి రావాలని, తప్పకుండా వస్తాడంటూ ఎంతో మంది ఆకాంక్షిస్తున్నారు. కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకున్న తర్వాత కూడా కోహ్లీపై భారం తగ్గలేదంటూ వ్యాఖ్యలు వినిపిస్తూనే ఉన్నాయి. తనపై వస్తున్న విమర్శలు కావచ్చు లేదా విశ్రాంతి తీసుకోవాలంటూ ఎంతో మంది చేస్తున్న విజ్ఞప్తి కావచ్చు. ప్రస్తుతం జరుగుతున్న వెస్టిండీస్ టూర్ నుంచి విరాట్ కోహ్లీ స్వచ్ఛందంగా విశ్రాంతి తీసుకున్నాడు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) విశ్రాంతి కదా అని కోహ్లీ ఊరికే కూర్చేలేదు. విరాట్ అప్పుడే ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టేశాడు. ఓ దేశీ బీట్ కు తనదైన శైలిలో ఎక్సర్ సైజ్ చేస్తున్న వీడియో ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. కోహ్లీ ఫిట్‌నెస్ లెవల్స్ చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇంక త్వరలోనే విరాట్ తిరిగి పుంజుకుంటాడంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 71వ సెంచరీ బాదేందుకు ఎక్కువ దూరం లేదంటూ కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ తిరిగి పుంజుకుంటాడా? మీ అభిప్రాయాలన కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) ఇదీ చదవండి: బెన్ స్టోక్స్ రిటైర్మెంట్‌లో కొత్త ట్విస్ట్.. ఆ గొడవే కారణమా? ఇదీ చదవండి: కోహ్లీని ఫామ్‌లోకి తెచ్చేందుకు రంగంలోకి దిగిన గంగూలీ