చూడముచ్చటైన సెలెబ్రిటీ జంటల్లో విరాట్ కోహ్లీ, అనుష్కల జంట ఒకటి. అభిమానులు ఈ జంటను ముద్దుగా ‘విరుష్క’ అని పిలుస్తుంటారు. 2017లో ఈ జంట ప్రేమ వివాహం చేసుకుంది. వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా పుట్టింది. ఆ పాపకు ‘వామిక’ అని పేరు పెట్టుకున్నారు. అటు విరాట్‌కు కావచ్చు, ఇటు అనుష్క శర్మకు కావచ్చు.. ఫ్యామిలీ మొదటి ప్రాధాన్యం. ఏమాత్రం వైరం దొరికినా ఈ జంట పాపతో కలిసి సంతోషంగా గడిపేస్తారు. తాజాగా ఈ జంట.. మాల్దీవుల్లో సందడి చేస్తున్నారు. పెళ్లయ్యాక ఏదో అరకొర సినిమాలు చేస్తూ.. అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్న అనుష్క శర్మ.. ఫ్యామిలీకే అధిక సమయం కేటాయిస్తోంది. వేసవి కావడంతో మాల్దీవుల్లో పర్యటిస్తూ భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో విరాట్ కోహ్లీ ఫోటో మాత్రం.. సముద్రం వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తున్నట్లు ఉండగా, అనుష్క శర్మ మాత్రం స్విమ్ సూట్‌తో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) ఇది కూడా చదవండి: IND vs SA 1st T20: వీడియో: ఢిల్లీ మ్యాచులో ప్రేక్షకుల కొట్లాట.. ఆలస్యంగా వెలుగులోకి.. ఆరెంజ్ కలర్ స్విమ్ సూట్, తలకు టోపీ పెట్టుకున్న ఫోటోలను పోస్ట్ చేసిన అనుష్క శర్మ.. వాటికి "మీ ఫొటోలను మీరే తీసుకుంటే.. వచ్చే రిజల్ట్ ఇదే" అని క్యాప్షన్ జత చేసింది. అయితే.. అనుష్క శర్మ ఫోటోలు హద్దుమీరి ఉండడంతో నెటిజెన్లు తమదైన శైలిలో విరుచుకు పడుతున్నారు. "నువ్ పెళ్లిచేసుకుంది అనామక వ్యక్తిని కాదు.. ఒక బ్రాండ్ ని.. అతని పరువు బజారుకీడ్చకు.." అంటూ కామెంట్స్ చేటున్నారు. View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) కాగా, విరాట్ కోహ్లీ గత కొంత కాలం నుంచి ఆటలో ఆశించిన స్థాయి ప్రదర్శనను కనబర్చటం లేదు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లోనూ పేలవ ప్రదర్శనను కనబర్చారు. త్వరలో ఇంగ్లాండ్ పర్యటన ఉన్న నేపథ్యంలో వెకేషన్‌లో విశ్రాంతి తీసుకుని, నూతన ఉత్సాహంతో ఇండియాకు తిరిగిరావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి, విరాట్, అనుష్కల వెకేషన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.