క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ ఎంత ఫేమస్సో.. సినీ ప్రపంచంలో మెగాస్టార్ అంతే ఫేమస్. టాలీవుడ్లోనే కాదు భారత చిత్రసీమలో ఈ పేరుకు స్పెషల్ క్రేజ్ ఉంది. చిరు కాలు కదుపుతున్నాడంటే.. అది చూస్తున్న మనం కూడా ఆటోమేటిక్ గా కాలు కదపాల్సిందే. ఒక్క డాన్స్ ఏంటి.. యాక్టింగ్, యాక్షన్, కామెడీ,.. ఇలా అన్నీ జోనర్లలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే హీరో.. మెగాస్టార్. ఈ మెగా హీరో సాంగ్స్‌కు.. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా చిందులేసేవాడట. ఈ విషయాన్ని విరాట్ స్నేహితుడు తెలుగు క్రికెటర్ ద్వారక రవితేజ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. అండర్ 15 క్రికెట్ ఆడే రోజుల్లో విరాట్ కోహ్లీ, ద్వారకా రవితేజ రూంమేట్స్. ఈ ఇద్దరూ ఆరేళ్ల గ్యాప్ తర్వాత కలుసుకున్నారు. ఈ సందర్భంగా కోహ్లీతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ షేర్ చేస్తూ..పాత జ్ఞాపకాలను పంచుకున్నాడు రవితేజ. "అండర్ 15 క్రికెట్ ఆడే టైంలో విరాట్, తాను అప్పుడప్పుడు చిరంజీవి పాటలకు డ్యాన్స్ చేసేవాళ్లమని గుర్తు చేసుకున్నాడు. అంతేకాదు ఇద్దరూ ఒకరికొకరం చిరు అని పిలుచుకునేవాళ్లమని చెప్పుకొచ్చాడు. యూకేలో ఆరేళ్ల విరామం తర్వాత విరాట్‌ను కలిశా. నన్ను చూడగానే 'చిరు ఎలా ఉన్నావ్' అని ఆప్యాయంగా పలకరించాడు. మేమిద్దరం రూమ్‌మేట్స్ గా ఉన్న సమయంలో నేను టీవీలో చిరంజీవి పాటలు చూస్తుంటే.. విరాట్ ఆ పాటలకు డ్యాన్స్ చేసేవాడు. అప్పటి నుండి ఇప్పటివరకు మేం ఒకరినొకరు మా పేర్లతో పిలుచుకోలేదు. చిరు అనేది మేము ఒకరికొకరు పెట్టుకున్న ముద్దుపేరు. మేమిద్దరం కలిసినప్పుడల్లా ఒకరినొకరు చిరు అని పిలుచుకుంటాం. ఆ మధుర జ్ఞాపకాలు.. ఇన్నాళ్లైనా అలానే ఉన్నాయి. ఏదీ మారలేదు. నిన్ను చూడటం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే మళ్లీ మనం కలుస్తాం అని ఆశిస్తున్నాను చిరు" అంటూ ఆనాటి మధుర క్షణాలను పంచుకున్నాడు రవితేజ. ఈ క్రేజీ న్యూస్ తెలిసిన మెగా అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. కోహ్లీ కూడా మెగాస్టార్ కు అభిమానిగా మారడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by RAVI TEJA DB (@dwarakaraviteja) ఇది కూడా చదవండి: వీడియో: ఇంగ్లాండ్ ఆటగాళ్ల గాలి తీసేసిన బుమ్రా భార్య.. ఇది కూడా చదవండి: ఊరంతా అవమానించినా.. ఆమె మాత్రం రాష్ట్రానికే పేరు తెచ్చింది!