ఆసియా కప్ సూపర్-4 దశలో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచులో భారత జట్టు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కీలక సమయంలో ఆసిఫ్ అలీ క్యాచ్ జారవిడిచి టీమిండియా ఓడిపోయేలా చేశాడంటూ యువ పేసర్ అర్షదీప్ సింగ్ పై కొందరు మూర్ఖులు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భారతీయుడిగా చెప్పుకున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి.. అర్షదీప్ పై నేరుగా దూషణకు దిగాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆసియా కప్ 2022 పేరులో టీమిండియా పోరాటం దాదాపు ముగిసింది. సూపర్-4 తొలి మ్యాచులో పాకిస్తాన్ పై ఓటమి పాలైన భారత జట్టు, శ్రీలంకతో జరిగిన రెండో మ్యాచులో కూడా ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లు హోటల్ కు బయల్దేరే సమయంలో.. బస్ ఎక్కుతుండగా.. అక్కడే ఫోన్ పట్టుకుని వీడియో తీస్తున్న ఓ భారతీయ సంతతి వ్యక్తి .. అర్షదీప్ డ్రాప్ క్యాచ్ ను ఉద్దేశిస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ మాటలు విన్న అర్షదీప్ సైతం కాసేపు ఆగి బస్ ఎక్కి లోపలికి వెళ్ళిపోయాడు. Setbacks are the building blocks for success. We believe in you, Arsh. #SaddaPunjab #PunjabKings #ArshdeepSingh #INDvPAK #IStandWithArshdeep pic.twitter.com/6DnEb5eSEt — Punjab Kings (@PunjabKingsIPL) September 5, 2022 ఈ సమయంలో అక్కడే ఉన్న ఓ స్పోర్ట్స్ జర్నలిస్ట్.. సదరు వ్యక్తిని అడ్డుకున్నాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తితో ఇలాగేనా ప్రవర్తించేదంటూ ఎడాపెడా వాయించాడు. ఈ విషయంపై అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది సైతం అలెర్ట్ అవుతుండగా.. సదరు వ్యక్తి మెల్లగా అక్కడినుంచి జారుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అర్షదీప్ కు మద్ధతుగా నిలిచిన సదరు జర్నలిస్టును భారత అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: Arshdeep Singh: బౌలర్ అర్షదీప్ వ్యవహారంపై కేంద్రం సీరియస్… సమన్లు జారీ ఇదీ చదవండి: Arshdeep Singh: క్యాచ్ వదిలేసిన అర్షదీప్ పై జాత్యాంహకార దూషణలు.. అండగా హర్భజన్!