లేటుగా వచ్చినా.. లేటెస్ట్ గా వచ్చాడురా.. బిజ్జీ! ఈ డైలాగ్ టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కు కరెక్టుగా సరిపోతుంది. ఒక్కటంటే ఒక్కటే మ్యాచ్ తో సూర్య తన కెరీర్ లోనే ఉత్తమ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇటీవల ఇంగ్లాండుతో జరిగిన టీ20 సిరీస్‌లో అదరగొట్టిన అతడు ఏకంగా 44 స్థానాలు ఎగబాకి.. ఇదో ర్యాంకుకు చేరుకున్నాడు. కాగా, ఇంగ్లాండుతో జరిగిన టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ మెరుగైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. మొదటి రెండు టీ20ల్లో 39,15 పరుగులు చేసిన సూర్య.. మూడో టీ20లో మాత్రం విశ్వరూపం ప్రదర్శించాడు. 55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్లతో 117 పరుగులు సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు ఇది తొలి సెంచరీ కావడం విశేషం. టీ20ల్లో.. సూర్య మినహా మరే ఇతర టీమిండియా బ్యాటర్‌కు టాప్-10లో చోటు దక్కకపోవడం గమనార్హం. ఐసీసీ టీ20 బ్యాటర్ ర్యాంకింగ్స్: టాప్-10 1.బాబర్ ఆజమ్(పాకిస్తాన్) 2. మహ్మద్ రిజ్వాన్(పాకిస్తాన్) 3.ఎయిడెన్ మార్కరమ్(దక్షిణాఫ్రికా) 4. డేవిడ్ మలన్(ఇంగ్లాండ్) 5. సూర్యకుమార్ యాదవ్(ఇండియా) 6.ఆరోన్ ఫించ్(ఆస్ట్రేలియా) 7. డెవాన్ కాన్వే(న్యూజిలాండ్) 8.నికోలస్ పూరన్(వెస్టిండీస్) 9.పాథుమ్ నిశాంక(శ్రీలంక) 10. మార్టిన్ గఫ్టిల్(న్యూజిలాండ్), రసీ వాన్ డెర్ డసెన్(దక్షిణాఫ్రికా) ఇక.. వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్ లో బాబర్ ఆజమ్(పాకిస్తాన్) మొదటి స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. 3,4 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక.. బౌలర్ ర్యాంకింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా(ఇండియా) మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక జట్ల పరంగా చూస్తే.. టీ20ల్లో మొదటి స్థానంలో ఉన్న టీమిండియా.. టెస్టుల్లో రెండో స్థానంలో.. వన్డేల్లో మూడో స్థానంలో ఉంది. ICC T20 Ranking Batsman: Suryakumar Yadav has moved up 44 places to be included in the top 5 in the ICC rankings, ICC released the latest ranking of T20 batsmen.https://t.co/f3IwCdot8K ICC T20 Ranking Batsman: Suryakumarhttps://t.co/mjAk9wqcmQ pic.twitter.com/zTEYFXvfMT — Baba Cric (@BabaCric) July 13, 2022 ఇది కూడా చదవండి: వీడియో: రోహిత్ శర్మ భారీ సిక్సర్.. చిన్నారికి గాయం! ఇది కూడా చదవండి: IND Vs ENG: ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాము: బట్లర్