టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ టీ20 ర్యాకింగ్స్‌లో దుమ్ములేపాడు. ఏకంగా నంబర్ టూ స్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ తర్వాతి స్థానంలో నిలిచాడు. మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులతో 74 పరుగలతో అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్.. 816 పాయింట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో పాక్ క్రికెటర్ మొహమ్మద్ రిజ్వాన్‌ను వెనక్కు నెట్టి రెండోస్థానాన్ని అందుకున్నాడు. కాగా బాబర్ అజమ్ 818 పాయింట్లతో మొదటిస్థానంలో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో రిజ్వాన్ 794 పాయింట్లతో ఉన్నాడు. ఇక బాబర్‌కు, సూర్యకుమార్ యాదవ్‌కు కేవలం రెండు పాయింట్లే తేడా ఉండటంతో.. వెస్టిండీస్‌తో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన కనబరిస్తే.. వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా నిలిచే అవకాశం ఉంది. SKY moves to within two rating points of the No. 1 position in the Men's T20I batting rankings With two #WIvIND games still remaining, can he displace Babar Azam? — ESPNcricinfo (@ESPNcricinfo) August 3, 2022