టీమిండియా వెటరన్ క్రికెటర్ సురేష్ రైనా అప్పుడే తన కుమారుడికి క్రికెట్ ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. తండ్రి బౌలింగ్ వేస్తుంటే.. జూనియర్ రైనా భారీ షాట్లు ఆడాడు. బ్యాట్ లాంటిది ఏదో ప్లాస్టిక్ ఆటవస్తువు పట్టుకుని రైనా ప్లాస్టిక్ బాల్ విసురుతుంటే.. రియో ఎంతో చక్కగా బుజ్జిబుజ్జిగా కొడుతున్నాడు. రైనా కుమారుడు రియో క్రికెట్ ఆడుతున్న వీడియోను చెన్నై సూపర్‌కింగ్స్ తమ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసింది. సింహం లాంటి తండ్రితో కలిసి వేగంగా ఎదిగిపోతున్నాడు అంటూ ఆ వీడియో క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘రైనా వారసుడు వచ్చేస్తున్నాడు.!’ అంటూ నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సురేష్ రైనా 2005లో శ్రీలంకతో వన్డే మ్యాచ్ సందర్భంగా టీమిండియాలోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి జట్టులో కీ ప్లేయర్‌గా సేవలందించాడు. అలాగే 2006లో టీ20 జట్టులోకి, 2010లో టెస్టు టీమ్‌లో కూడా రైనా ఆడాడు. కానీ.. ఐపీఎల్ తర్వాత రైనా టీ20 స్ఫెషలిస్ట్ బ్యాటర్‌గా మారాడు. ధోనికి అత్యంత సన్నిహితుడిగా రైనాకు పేరుంది. తన కెరీర్‌లో మొత్తం 226 వన్డేలు ఆడిన రైనా 5615 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు, 36 హాఫ్‌సెంచరీలు చేశాడు. అలాగే 18 టెస్టులు ఆడి 768 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 78 అంతర్జాతీయ టీ20ల్లో ఆడిన రైనా 1605 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ప్లేయర్‌గా రైనా నిలిచాడు. ఇక మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన రైనా.. 205 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 5528 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 39 హాఫ సెంచరీలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఎన్నో మ్యాచ్‌ల్లో ఒంటి చేత్తో గెలిపించాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రైనా.. ఐపీఎల్‌లో ఆడేందుకు ఆసక్తి చూపించాడు. కానీ.. ఐపీఎల్ 2022 మెగా వేలంలో రైనాను ఏ ఫ్రాంచైజ్ కూడా కొనుగోలు చేపేందుకు ఆసక్తి చూపించలేదు. కాగా.. ఐపీఎల్ 2023లో రైనా బరిలోకి దిగే అవకాశం ఉంది. మరి రైనా కుమారుడు రియో బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌నూ చిత్తు చేసిన అఫ్ఘనిస్థాన్! రషీద్ ఖాన్ ఖాతాలో అరుదైన రికార్డు Growing up fast with Daddy lion! #Yellove #WhistlePodu @ImRaina pic.twitter.com/GqI7xy4reZ — Chennai Super Kings (@ChennaiIPL) August 31, 2022