2007లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులకు బలైన ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఒక అరుదైన రికార్డును సాధించాడు. ఒకే గ్రౌండ్‌లో 100 వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో లార్డ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో బ్రాడ్ ఈ రికార్డును సాధించాడు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కైల్ వెర్రెయిన్నేను అవుట్ చేయడం ద్వారా క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానంలో బ్రాడ్ 100 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు. ఇలాంటి రికార్డు నెలకొల్పిన నాలుగో బౌలర్‌గా బ్రాడ్ నిలిచాడు. ఇంతకు ముందు శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీథరణ్, ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జెమ్స్ అండర్సన్, మరో శ్రీలంక బౌలర్ రంగనా హెరాత్ ఈ రికార్డును కలిగి ఉన్నారు. ముత్తయ్య మురళీథరణ్ ఏకంగా మూడు గ్రౌండ్స్‌లో 100కు పైగా వికెట్లు తీశారు. కొలంబో(166), కాండీ క్రికెట్ స్టేడియం(117), గాలె(11) వికెట్లు పడగొట్టాడు. అలాగే జెమ్స్ అండర్సన్ లార్డ్స్‌లోనే 117 వికెట్లు తీసుకున్నాడు. రంగనా గాలె స్టేడియంలో 102 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు బ్రాడ్‌కు కూడా లార్డ్స్‌లో 100 వికెట్లు ఉన్నాయి. మరి ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: టీమిండియాపై అరుదైన రికార్డు నమోదు చేసిన జింబాబ్వే! Stuart Broad joined a very exclusive club pic.twitter.com/22B0OUwQ2J — ESPNcricinfo (@ESPNcricinfo) August 18, 2022