పాకిస్థాన్ యువ బౌలర్ మొహమ్మద్ హస్నైన్ త్రో బౌలింగ్ వేస్తున్నాడంటూ ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినీస్ యాక్షన్ చేసి మరీ చూపించాడు. స్టోయినీస్ చేసిన ఈ పని ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం సదరన్ బ్రేవ్, ఓవల్ ఇన్విన్సిబుల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో స్టోయినీస్ సదరన్ బ్రేవ్ తరపున బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓవల్ తరపున ఆడుతున్న పాక్ పేసర్ మొహమ్మద్ హస్నైన్ 142 కిమీ వేగంతో షార్ట్ బాల్‌ను సంధిస్తాడు. ఆ బంతిని స్టోయినీస్ ఫుల్ షాట్ ఆడే క్రమంలో మిస్టైమ్ అయి.. గాల్లోకి లేస్తుంది. మిడ్ ఆఫ్‌లో ఫీల్డర్ దాన్ని క్యాచ్‌గా అందుకుంటాడు. దీంతో స్టోయినీస్ పెవిలియన్ చేర్సాల్సి వస్తుంది. డగౌట్‌కు వెళ్తున్న క్రమంలో స్టోయినీస్ బౌలింగ్ యాక్షన్ చేస్తూ.. త్రో బౌలింగ్ అంటూ అర్థం వచ్చేలా చూపిస్తాడు. స్టోయినీస్ ఇలా చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా స్టోయినీస్పై పాక్ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. బౌలింగ్ యాక్షన్ సవ్యంగా ఉందని ఐసీసీ ఇచ్చిన క్లియరెన్స్‌ను స్టోయినీస్ అవమానించాడంటూ పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ మండిపడ్డాడు. నిజంగానే బౌలర్ యాక్షన్‌లో తేడా ఉంటే అంపైర్లకు ఫిర్యాదు చేయాలని.. ఇలా సైగలు చేస్తూ అవుట్ అయిన అసహనాన్ని ప్రదర్శించడం సరైంది కాదని పలువురు మాజీలు సైతం హితవు పలుకుతున్నారు. కాగా.. క్రికెట్లో కొన్ని సార్లు ఆటగాళ్ల బౌలింగ్ యాక్షన్‌పై అంపైర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. సరైన విధంగా బౌలింగ్ వేయడం లేదని, బౌలింగ్ యాక్షన్‌లో ఏదో తేడా కొడుతుందంటూ.. త్రో బౌలింగ్‌లా అనిపిస్తుందని అంపైర్లు ఐసీసీకి ఫిర్యాదు చేస్తారు. దీంతో ఐసీసీ వారికి వివిధ రకాల బౌలింగ్ టెస్టులు నిర్వహించి సమస్యను పరిష్కరిస్తుంది. అంతా బాగానే ఉంటే క్లీన్ చిట్ ఇస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే బౌలింగ్ యాక్షన్‌లో కొన్ని మార్పులు చేర్పులను సూచిస్తుంది. గతంలో చాలా మంది క్రికెటర్లకు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు. శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీథరణ్, వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్‌లు ఈ పరిస్థితి ఎదుర్కొన్నవారే. మరి మొహమ్మద్ హస్నైన్ బౌలింగ్ యాక్షన్‌పై స్టోయినీస్ వ్యవహరించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Marcus Stoinis criticized for accusing Mohammad Hasnain of chucking in #TheHundred After getting out, the Australian all-rounder did a disgraceful act as he imitated Hasnain’s action to be a chucking one Read more: https://t.co/1wedChXGJf#Stoinis #Hasnain pic.twitter.com/YOPLvMu4c6 — Cricket Pakistan (@cricketpakcompk) August 15, 2022 Disappointing reaction from Marcus Stoinis after he was dismissed by Mohammad Hasnain. How about sticking to playing cricket and letting the officials do their job #TheHundred #Cricket pic.twitter.com/oYOSb12GTr — Saj Sadiq (@SajSadiqCricket) August 14, 2022 Marcus Stonis accuses Mohammad Hasnain of chucking. Might be looking at some sanction from disciplinary committee. #TheHundred #Stoinis #MohammadHasnain #OvalInvincibles pic.twitter.com/AgnvcytE0I — Blatantly.blunt (@ludoplayer) August 15, 2022 ఇది కూడా చదవండి: భారత్-పాక్ మ్యాచ్.. అప్పుడే కామెంట్స్ మొదలెట్టిన పాక్ క్రికెటర్!