లెజెండ్స్ లీగ్ క్రికెట్‌కు సర్వం సిద్ధమైంది. వేదికలు, తేదీలతో పాటు ఏ జట్టులో ఏఏ ఆటగాళ్లు ఉన్నారో స్పష్టమైంది. టీమిండియా మాజీ దిగ్గజ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇండియా మహారాజాస్‌కు జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. అలాగే వరల్డ్ జెయింట్స్ టీమ్‌కు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇండియా మహారాజాస్-వరల్డ్ జెయింట్స్ మధ్య సెప్టెంబర్ 16న ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరగనుంది. మన దేశానికి స్వాతంత్ర వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా అ టోర్నీని నిర్వహిస్తున్నారు. అలాగే ఈ మ్యాచ్ గంగూలీతో పాటు మరికొంత మంది దిగ్గజ మాజీ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. చాలా కాలం తర్వాత తమ అభిమాన క్రికెటర్ల ఆటను మరోసారి చూసే అదృష్టం దక్కుతుండడంతో క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఈ టోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండియా మహారాజాస్ టీమ్.. సౌరవ్ గంగూలీ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, మొహమ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, ఎస్ బద్రినాథ్, పార్థీవ్ పటేల్(వికెట్ కీపర్), శ్రీశాంత్, ఎస్ బిన్ని, హర్భజన్ సింగ్, నమన్ ఓజా(వికెట్ కీపర్), అశోక్ దిండా, ప్రజ్ఞాన్ ఓజా, ఆర్పీ సింగ్, జోగిందర్ శర్మ, ఆర్‌ఎస్ సోధి. వరల్డ్ జెయింట్స్ టీమ్.. ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), సిమన్స్, హర్షల్ గిబ్స్, జాక్వస్ కలిస్, సనత్ జయసూర్య, పిరియర్(వికెట్ కీపర్), నాథన్ మెక్‌కల్లమ్, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీథరణ్, డెయిల్ స్టెయిన్, హామిల్టన్, మోర్తాజా, అస్గర్ అఫ్ఘాన్, మిచెల్ జాన్సన్, బ్రెట్‌లీ, కెవిన్ ఓబ్రైన్, దినిష్ రామ్‌దిన్(వికెట్ కీపర్). So the India vs Rest of the World game is on September 15 at Eden Gardens. Sourav Ganguly leads India and Eoin Morgan the World. Part of Legends League cricket @SGanguly99 @ramanraheja @Eoin16 pic.twitter.com/waE9GWSMEr — Vikrant Gupta (@vikrantgupta73) August 12, 2022