పాకిస్తాన్ కు చెందిన అధికారులు, నేతలు, క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు ఇలా కేడర్ ఏదైనా, ఎవరైనా సరే సందర్భం దొరికినా, దొరక్కపోయినా సరే భారత్, టీమిండియాపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటారు. ఇలాంటి కామెంట్లు చేయడంలో పాక్ మాజీ క్రికెటర్లు అందరికంటే కాస్త ముందే ఉంటారు. అయితే అలా వాళ్లు మాట్లాడే ప్రతి మాటకు భారత్ నుంచి గట్టి కౌంటర్ అయితే పడుతూనే ఉంటుంది. కానీ, తాజాగా అలాంటి పరిస్థితి కనిపించలేదు. ఓ టీవీ డిబెట్ లో పాల్గొన్న షాహీద్ అఫ్రిదీ గౌతమ్ గంభీర్‌పై నోరు పారేసుకున్నాడు. అదే డిబేట్‌లో ఉన్న టీమిండియా మాజీ స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాత్రం స్పందించలేదు. ఇప్పుడు షాహిద్ అఫ్రిదీ చేసిన ఆ వ్యాఖ్యలు హర్భజన్ మెడకు చుట్టుకున్నాయి. అసలు హర్భజన్‌నే బాయ్‌కాట్ చేయాలంటూ నెట్టింట్ డిమాడ్ చేస్తున్నారు. టీమిండియా మాజీ ఆటగాళ్లతో మీకున్న బంధం ఎలాంటిదని ఓ టీవీ ఇంటర్వ్యూలో షాహిద్ అఫ్రిదీ అడిగిన సందర్భంలో గౌతమ్ గంభీర్ గురించి ప్రస్తావించాడు. గౌతమ్ గంభీర్ వల్ల తనకి ఛేదు అనుభవాలే ఉన్నాయని వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా గౌతమ్ గంభీర్ అంటే అసలు టీమిండియాలోని వాళ్లకే నచ్చదంటూ వ్యాఖ్యానించాడు. నిజానికి 2007 కాన్పూర్ వన్డోలే అయితే పిచ్ మధ్యలో షాహిద్ అఫ్రిదీ- గౌతమ్ గంభీర్ కొట్టుకున్నంత పని జరిగింది. This is wrong statement by Afridi @GautamGambhir always will be hero whole india .....Afridi says India team hi pasand nhi karti what nonsense don't speak anything about gauti sir We loved ❤️ Gautam gambhir pic.twitter.com/iugWFXPZ91 — AJ (@biharshain) August 28, 2022 గౌతమ్ గంభీర్‌పై షాహిద్ అఫ్రిదీ నోరు పారేసుకుంటుంటే ఖండించకపోగా హర్భజన్ నవ్వుతూ ఉండటంతో ఇప్పుడు నెటిజన్లు, టీమిండియా అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఒక పాక్ మాజీ ఆటగాడు తన సహచరుడిని కామెంట్ చేస్తే హర్భజన్ అలా ఎలా నవ్వుతూ ఉండిపోయాడంటూ ప్రశ్నిస్తున్నారు. ఒక పాకిస్తాన్ ఆటగాడి ముందు టీమిండియా పరువు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Unexpected from Bhajji#INDvPAK #INDvsPAK #HarbhajanSingh #BCCI #IndianCricket #ShahidAfridi #AsiaCup #T20WorldCup #GautamGambhir #Cricket pic.twitter.com/hFG6JZs7rH — ScoresNow (@scoresnow_in) August 29, 2022 అంతేకాకుండా ఈ మొత్తం ఘటనలో రాజకీయ కోణం కూడా ఉందంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. అదేంటంటే గౌతమ్ గంభీర్ బీజేపీ ఎంపీ అని.. హర్భజన్ సింగ్ ఆప్ ఎంపీ అని అందరికీ తెలిసిందే. ఇద్దరూ వేర్వేరు పార్టీల ఎంపీలు కావడంతోనే గౌతమ్ గంభీర్‌ను సమర్ధించకుండా హర్భజన్ నవ్వి ఊరుకున్నాడంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. AAP MP Harbhajan Singh took side of Pakistani Shahid Afridi in mocking Gautam Gambhir just bcz he is a BJP MP. It's clear now that AAPiyas in their BJP-Hate will even support Pakistan against India. — S̶c̶a̶r̶ (@4racs) August 28, 2022 అయినా నీ జట్టులోని సభ్యుడిని, నీ మిత్రుడు, నీ సహచరుడు అయిన ఒక వ్యక్తిని పాకిస్తాన్ వ్యక్తి హేళన చేస్తుంటే నోరు మెదపకపోగా నవ్వుతావా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ #BoycottHrbhajan అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కూడా అవుతోంది. హర్భజన్ చేసిన పనిని క్రికెట్ అభిమానులే కాదు.. నెటిజన్లు సైతం తప్పుబడుతున్నారు. హర్భజన్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Afridi : Gautam Gambhir is such a person I am sure that nobody liked him in Indian team as well. Harbhajan Singh : Hehehehhe Show me a more shameless person than Harbhajan Singh. There is a reason AAP nominated him to RS. He fulfills all the criteria. — Incognito (@Incognito_qfs) August 28, 2022 This Harbhajan singh can never match his level pic.twitter.com/m09gNMW1K8 — iuc (@Never_EVER_MeE) August 28, 2022