సచిన్ టెండూల్కర్ ఎంత గొప్ప క్రికెటరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు దశాబ్దాలకు పైగా ప్రపంచ క్రికెట్‌లో తిరుగులేని బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. అత్యుత్తమ బౌలర్లను సమర్థవంతగా ఎదుర్కొని అద్భుతమైన షాట్లు ఎన్నో ఆడాడు. నిజానికి సచిన్ ఆడే కొన్ని షాట్లు ఎన్ని సార్లు చూసినా.. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటాయి. సచిన్ వాటిని ఎంతో స్టైల్‌గా, పర్ఫెక్ట్‌గా కొట్టడమే అందుకు కారణం. సచిన్ స్ట్రేట్‌డ్రైవ్ అడితే ఎంత అద్భుతంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అలాగే అప్పర్ కట్, పుల్‌షాట్లు ఎంతో కచ్చితంగా, స్టైలిష్‌గా ఆడగలడు. కానీ.. సచిన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత క్రికెట్ అభిమానులు.. అతని పాత షాట్లనే అప్పుడప్పుడూ యూట్యూబ్‌లో చూసి ఆనందిస్తుంటారు. సచిన్ మళ్లీ అలాంటి షాట్లు ఆడితే చూడాలని ప్రతి క్రికెట్ అభిమానికి ఉంటుంది. కానీ అది సాధ్యమా? అనే అనుమానం కూడా వారిలో వ్యక్త అవుతుంది. కాగా క్రికెట్ కోసమే పుట్టిన సచిన్‌కు వయసు ఎప్పుడూ అడ్డంకి కాదు. ఇదే విషయాన్ని నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా నిరూపించాడు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. సోమవారం(ఆగస్ట్ 29) నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా సచిన్ తన మార్క్ షాట్లను మరోసారి ఆడి.. ఆ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ‘క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమించే నేను.. స్పోర్ట్స్‌డే నాడు క్రికెట్ ఆడకుండా ఉండగలనా..?’ అంటూ తన ట్రేడ్ మార్క్ షాట్లు ఆడాడు. సచిన్‌ను చూస్తూ పెరిగిన క్రికెట్ అభిమానులు మరోసారి సచిన్ ఇలాంటి షాట్లు కొట్టడం చూసి.. ‘ఈ వయసులో కూడా అంతే పర్ఫెక్ట్‌గా ఆ షాట్లు ఏంటి స్వామి’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ కోసమే పుట్టి, క్రికెట్‌నే ప్రాణంగా ప్రేమించి, ఇండియన్ క్రికెట్‌కు దేవుడిగా ఎదిగిన సచిన్‌కు ఇలాంటి షాట్లు ఆడేందుకు వయసు ఎప్పుడూ అడ్డుకాదని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో వేదికగా పేర్కొంటున్నారు. సచిన్ తన కెరీర్‌లో మొత్తం 200 టెస్టులు ఆడి 15921 పరుగులు చేశాడు. అందులో 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 463 వన్డేలు ఆడి 18426 పరుగులతో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. వన్డేల్లో సచిన్‌కు 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన కెరీర్‌లో ఒకే ఒక అంతర్జాతీయ టీ20 ఆడిన సచిన్ ఆ మ్యాచ్‌లో తన జెర్సీ నంబర్ 10 పరుగులు చేశాడు. అలాగే ఐపీఎల్‌లో 78 మ్యాచ్‌లు ఆడిన సచిన్ 2334 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో సచిన్‌కు ఒక సెంచరీతో పాటు 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సచిన్ తన బౌలింగ్‌తోనూ అంతర్జాతీయ క్రికెట్‌పై తన ముద్ర వేశాడు. వన్డేలు, టెస్టుల్లో కలుపుకుని సచిన్ 107 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో రెండు సార్లు 5 వికెట్ల హాల్ సాధించాడు. ఇలా అంతర్జాతీయ క్రికెట్‌ను ఏలిన సచిన్.. తాజాగా తనలో ఏ మాత్రం పవర్ తగ్గలేదని నిరూపిస్తూ.. స్ట్రేట్‌డ్రైవ్, అప్పర్ కట్, ఫుల్‌షాట్లు ఆడి ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: వీడియో: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత ఏడుస్తూ గ్రౌండ్ వీడిన పాక్ పేసర్