ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఎక్కడ లేని హైవోల్టేజ్ ఇరుదేశాల ప్రజల్లో కలుగుతుంది.ఈ దాయాది దేశాలు మాములు సాదాసీదా మ్యాచ్ లో తలపడితేనే అభిమానుల్లో ఎంతో హైప్ క్రియేట్ అవుతుంది. ఈ క్రమంలో దాదాపు చాలా కాలం తరువాత ఈ రెండు దేశాలు మళ్లీ క్రికెట్‌లో తలపడనున్నాయి. ఆసియా కప్-2022లో భాగంగా ఆగస్టు 28 సాయంత్రం రాత్రి 7:30 గంటలకి ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దీంతో మ్యాచ్‌పై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దానికితోడు మ్యాచ్ ఆదివారం జరుగుతుండటంతో ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి మ్యాచ్‌ని ఎంజాయ్ చేసేందుకు అభిమానులు సిద్ధమైపోయారు. అయితే ఓ విద్యాసంస్థ మాత్రం విద్యార్ధులకు ఊహించని షాకిచ్చింది. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ చూస్తే రూ.50000 జరిమానా వేస్తామని హెచ్చరించింది. ఇంతకు ఆ విద్యాసంస్థ ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందు? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. భారత్, పాకిస్థాన్ జట్లు 2021 టీ20 ప్రపంచకప్‌లో చివరిసారిగా తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో భారత్ కు ఘోర పరాభవం ఎదురైంది. పాకిస్థాన్ చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో దారుణంగా ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే మ్యాచ్‌లో పాక్‌పై ఎలాగైనా గెలిచి.. ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇదిలా ఉంటే, భారత్, పాక్ క్రికెట్ సమరాన్ని చూడకూడదు అంటూ శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) యాజమాన్యం కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. పలు సామాజిక మధ్యమాల ద్వారా వివరాల మేరకు.. ఎన్‌ఐటీ విద్యార్ధులు ఇవాళ జరిగే ఇండియా-పాక్ మ్యాచ్‌ను వీక్షిస్తే కఠిన చర్యలు తప్పవని యాజమాన్యం హెచ్చరించినట్లు తెలుస్తోంది. హాస్టల్ లో గుంపులు చేరి మ్యాచ్ చూడకూడదని ఆదేశాలు జారీ చేసిన డీన్.. సోషల్ మీడియాలో కూడా ఎన్‌ఐటీ విద్యార్థులు ఎవరూ ఆ మ్యాచ్ పై కామెంట్లు పెట్టకూడదని అందులో పేర్కొన్నాడు. ఈ హెచ్చరికలను ఖేతరు చేసినవారికి..కాలేజీనుంచి బహిష్కరించడతో పాటు రూ.5000 జరిమాన విధిస్తామని డీన్ హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ అంక్షలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: టీమిండియా క్రికెటర్ల జీతాలు, మ్యాచ్ ఫీజులు, బోనస్‌ల వంటి పూర్తి వివరాలు! ఇదీ చదవండి: వీడియో: రస్సెల్ విధ్వంసం.. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన విండీస్ వీరుడు..