టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటగాడిగా, కెప్టెన్‌గా చాలా రికార్డులనే నెలకొల్పాడు. మహేంద్రసింగ్ ధోని తర్వాత టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి జట్టును విజయవంతంగా నడిపించాడు. కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ బాధ్యతలు అందుకున్నాడు. రోహిత్ కూడా ధోని, కోహ్లీల వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఒక అరుదైన రికార్డుపై రోహిత్ కన్నేశాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా 30 టీ20ల్లో విజయం సాధించింది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా భారత్ 29 టీ20ల్లో గెలిచింది. దీంతో కెప్టెన్‌గా కోహ్లీ 30 విజయాల రికార్డుకు రోహిత్ ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాడు. ఈ నెల 28న ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే.. రోహిత్ శర్మ కోహ్లీ రికార్డును సమం చేస్తాడు. అలాగే మరో మ్యాచ్ గెలిస్తే.. కోహ్లీ రికార్డును బ్రేక్ చేసి టీ20ల్లో టీమిండియాకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలుస్తాడు. కాగా.. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని 41 విజయాలతో టాప్‌లో ఉన్నాడు. ఆసియా కప్‌తో రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ధోని 72 టీ20ల్లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించి 41 విజయాలు అందించాడు. కోహ్లీ కెప్టెన్సీలో 50 టీ20లు ఆడిన టీమిండియా 30 గెలిచింది. అలాగే రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇప్పటివరకు టీమిండియా 35 మ్యాచ్‌లు ఆడి 29 విజయాలు సాధించింది.మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. This is Rohit Sharma's 29th win in 35 T20Is he captained in,surely bilateral win % don't matter much & nothing of this will matter if he does not win WorldT20, but winning these many games in such short time in a T20 format where any team can beat you gives big hope for WorldT20 — Abhinandan (@Abhinandan673) August 6, 2022