టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అతని భార్య ధనశ్రీ వర్మ మధ్య విభేదాలు వచ్చాయని, వారిద్దరు విడాకులు తీసుకునేందుకు సిద్ధపడుతున్నారంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు పుట్టుకొచ్చాయి. టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన పార్టీకి చాహల్ భార్య ధనశ్రీ టీమిండియా యంగ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి వెళ్లింది. ఈ విషయంపై దంపతుల మధ్య తీవ్రస్థాయి గొడవలు అయినట్లు ఇద్దరూ విడిపోయేందుకు నిర్ణయించుకున్నారంటూ కథనాల్లో పేర్కొన్నారు. అందుకు వారి సోషల్ మీడియా పోస్టులను ఆధారాలుగా చూపించారు. శ్రేయస్ అయ్యర్‌తో పార్టీ తర్వాత యుజ్వేంద్ర చాహల్ ‘న్యూలైఫ్ లోడింగ్’ అంటూ ఫొటో పోస్టు చేయడం, ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన పేరు పక్కన చాహల్ పేరు తొలగించడంతో ఇద్దరు మధ్య విభేదాలు వచ్చినట్లు అంతా భావించారు. కానీ.. తమ దాంపత్య జీవితం గురించి వస్తున్న వార్తలు నమ్మవద్దంటూ చాహల్, ధనశ్రీ తర్వాత వివరణ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒక సరదాగా ఒక రీల్ చేయడంతో పుకార్లకు ఫుల్‌స్టాప్ పడింది. ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేటతెల్లమైంది. తాజాగా ఇదే విషయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ.. ‘మా వాడి(చాహల్) గురించి, అతని పర్సనల్ లైఫ్ గురించి తప్పుడు వార్తలు రాసింది ఎవరూ’ అంటూ విలేకర్లను ప్రశ్నించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ విలేకర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్ అడిగిన ప్రశ్నకు ఓ జర్నలిస్ట్ బదులిస్తూ.. నేను కేవలం వారి పోస్టుల గురించి మాత్రమే రాశానని.. వారి వ్యక్తిగత జీవితం జోలికి పోలేదని అన్నాడు. కాగా.. ప్రస్తుతం రోహిత్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ ఆసియా కప్ కోసం యూఏఈలో ఉన్న విషయం తెలిసిందే. ఆదివారం పాకిస్థాన్‌తో మ్యాచ్‌తో టీమిండియా ఆసియా కప్ వేటను ప్రారంభించనుంది. చాహల్ తన దాంపత్య జీవితంపై వస్తున్న పుకార్లకు ఒక్క వీడియోతో పుల్‌స్టాప్ పెట్టి.. తన పూర్తి ఫోకస్ ఆసియా కప్‌పై పెట్టాడు. కాగా.. చాహల్ ఫ్యామిలీపై ఫేక్ ప్రచారం గురించి తెలుసుకున్న రోహిత్ శర్మ.. జర్నలిస్టులకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Rohit is asking these journalists who started the fake rumours about Chahal and Dhanashree.. pic.twitter.com/kBVb4PRi2u — r ★ (@itzzRashmi) August 27, 2022 View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) Chahal before marriage - Representing India on international level,known in almost every part of India Dhanashree before marriage- Representing tiktok community,wannabe social media influencer with some thousands chapri followers Decide urself,aukat kisko dekhni chaiye https://t.co/gxhslU2TMS — Jatin (@yuvi_010) August 18, 2022 #YuzvendraChahal #dhanashreeverma Dhanashree after removing Chahal from her name of insta #Dhanashree #chahal pic.twitter.com/760Ya8IUEF — Anil Choudhary (@AnilCho99336541) August 18, 2022 Not believe in any sort of rumours - yuzi chahal.#yuzichal #Dhanashree #relationship #rumours #YuzvendraChahal pic.twitter.com/wJVu4ESLYq — Manish (@Manish_ray_) August 18, 2022